Home తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర. వీపనగండ్ల:- వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.ఉదయం ఎనిమిది గంటలకే వచ్చిన జిల్లా కలెక్టర్ ముందుగా బీసీ కాలనీలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం పై వైద్య సిబ్బంది, అంగన్వాడీలు. ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ కాలనీలోని పలు ఇండ్లకు వెళ్లి ఇంటి శుభ్రతతో జిల్లా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రమ్ముల్లో తొట్లలో వీటిని ఎక్కువ రోజులు ఉంచుకోరాదని ఎక్కువ రోజులు నీళ్లు నిలువ ఉండడం వల్ల దోమలు ఈగలు పెరిగి మలేరియా డెంగీ చికెన్ గున్యా ఫైలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు వివరించారు.

ప్రతి శుక్రవారం డ్రైడే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లు ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు. బీసీ కాలనీలోని ఇంటి సందులో చెత్తచెదారం నిల్వ ఉండి ప్లాస్టిక్ డబ్బాలో వర్షపు నిల్వ ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వాటిని పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రభులే ప్రమాదం ఉందని గ్రామ శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు మెకువజామునే విధులకు వచ్చేలా చూడాలని పంచాయతీ కార్యదర్శి సురేష్ గౌడ్ సూచించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నాలకు సంబంధించిన రికార్డు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తున్నారు.

గ్రామంలోని పలు కాలనీలలో మురుగు కాలువలు లేక రోడ్లపైనే మురుగునీరు పారుతోందని, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు సీపీఎం నాయకులు కలెక్టర్‌కు వివరించారు. మురుగునీరు రోడ్లపై పారకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీ కి సూచించారు. మండల పరిధిలోని గోవర్ధనగిరిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పారిశుద్ధ్య నివారణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు, గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.

విధులకు సరిగ్గా హాజరుకాని వైద్య సిబ్బంది–వైద్యం అందక రోగుల ఇక్కట్లు

గ్రామంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు సరైన వైద్యం అందడం లేదని వైద్య సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులకు వస్తున్నారని తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి సీపీఎం నాయకులు ఆశన్న, శ్రీనివాసులు పలువురు గ్రామస్తులను కలెక్టర్ వివరించారు. సిబ్బంది తమ అనుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నారని, ఉన్న డాక్టర్లు కూడా ఉదయం 11 గంటలకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకే ఆసుపత్రికి వచ్చే రోగులకు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు వైద్యం చేసి వెళుతున్న జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

గ్రామస్తుల సమస్యలు విన్న జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు మాత్రమే ఉండటంతో ఎంతమంది వైద్యులు విధుల్లో ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అంటూ వారిని ప్రశ్నించారు. వైద్యులు ఇంకా రాలేదని సమాధానం ఇచ్చారు, అనంతరం రోగులకు అందుతున్న వైద్యంపై రికార్డులను పరిశీలించారు. కుక్క పాము కాటుకు గురైన వ్యక్తులకు చేసిన చికిత్సలకు ప్రత్యేక రికార్డులలో రాయాలని స్టాఫ్ నర్సులకు సూచించారు. ఫార్మసిస్ట్ గదిలో మందులను, రికార్డులను తనిఖీ చేశారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,వీపనగండ్ల ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప,డిపిఆర్ఓ సీతారాం నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తేజ,నాయబ్ తాసిల్దార్ కృష్ణమూర్తి,ఆర్ఐ ఏపీ కురుమూర్తి,ఓ శేఖర్ గౌడ్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech