ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా: విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు పాత సామాను దుకాణంలో ప్రత్యక్షమైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను రాత్రికి రాత్రి పాత సామానులు పంపిణీ చేయాలి. తెరిచిన మొదటి రోజే అన్నీ అందించారు.కానీ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు పాత సామాను కోనే దుకాణంలో దర్శనమిచ్చాయి.
ఈ పుస్తకాలను నిన్న రాత్రి ఓ వ్యక్తి అమ్మినట్లు తెలిపారు.ఈ పాఠ్య పుస్తకాలు అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందినవిగా పేర్కొన్నారు.అచ్చంపేటకు చెందిన విద్యార్థి సంఘం నాయకులు పాత సామాను దుకాణంలో పరిశీలించగా ఈ పాఠ్య పుస్తకాల బాగోతం బయటపడింది. 6వేల 9వందల రూపాయాలకు అమ్మ తూకం కింద ఉన్నట్లు తెలుస్తోంది.విద్యార్థి సంఘ నాయకులు జోక్యం చేసుకొని పాత సామాను దుకాణంలోని వాటిని తిరిగి పంపించారు.సంబందిత అధికారులకు సమాచారం అందించారు.బాధ్యులకు సంబంధించిన పుస్తకాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.స్పందించిన గిరిజన సంక్షేమశాఖ అధికారి కమాలాకర్ రెడ్డి.. .ఇద్దరు వర్కర్లు … కాశన్న..దానమ్మ ను సస్పెండ్ చేశారు.గోడౌన్ ఇంచార్జి తిరుపతయ్యకు షోకాజ్ నోటీసిచ్చారు.పూర్తి విచారణ జరిగింది.