- ఢిల్లీ – దర్భంగా స్పైస్ జెట్ విమానంలో గంటకు పైగా పనిచేయని ఏసీ
- వేడిగాలుల మధ్య ఉక్కపోతతో ప్రయాణికులకు చేదు అనుభవం
ముద్రణ వార్తలు, సెంట్రల్ డెస్క్: విమానంలో ప్రయాణిస్తున్నపుడు అందులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఒక్కసారిగా మొరాయిస్తే.. ఏమవుతుందో ఈ ప్రయాణికులు. ఢిల్లీ నుంచి దర్భంగాకి ప్రయాణించిన స్పైస్ జెట్ విమానం (SG 486)లో గంటకు పైగా ఏసీ పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వేడి గాలుల మధ్య ఉక్కపోతతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. చేతికి దొరికిన పేపర్లు, మ్యాగజైన్లతో విసురుకుని సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పైస్‌జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
ఢిల్లీ నుండి దర్భంగాకి ప్రయాణించిన స్పైస్‌జెట్ విమానం (SG 486)లో గంటకు పైగా పనిచేయని ఎయిర్ కండిషనింగ్ (AC).. వేడిగాలుల మధ్య ఉక్కపోతతో అస్వస్థతకు గురైన కొందరు ప్రయాణికులు. pic.twitter.com/boxVHrgRQP
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 19, 2024