ముద్ర,సెంట్రల్ డెస్క్:- తూర్పు ఆఫ్రికాలోని మలావి ఓ విమానం కుప్ప కూలింది. మాలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమాతో పాటు మరో తొమ్మిది మంది దుర్మరణ పాలయ్యారు.. ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.17 గంటలకు షెడ్యూల్ గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. ఆ విమానం ఉదయం 10.02 గంటల వరకు కూడా ల్యాండింగ్ కాలేదు. పైగా, రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం ప్రారంభించింది. రాజధాని నగరం లిలాంగ్వే నుంచి బయలుదేరిన ఈ విమానం రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్టు కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్షురాలు, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.
కాగా, విమానం కోసం అన్వేషణ కొనసాగించిన సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు నేటి ఉదయం విమాన శిధిలాలను కనుగొన్నారు.. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణించిన దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమ , చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్ (యూటీఎం)కి చెందిన ముగ్గురు అధికారులు అయిదుగురు.