ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లినా సీఎం పోస్టుకు రాజీనామా చేయకపోవడంపై తాజాగా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని. ఈ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని, ఆ విషయం కాబట్టే తాను రిజైన్ చేయలేదని వివరించారు. తాను అరెస్టైన నాటి నుంచి బీజేపీ నేతలు తన రాజీనామాకు డిమాండ్ చేసిన కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఈమెరకు శనివారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు.
'సీఎం పోస్టు ముఖ్యం కాదు నాకు. కానీ పదవి నుంచి దింపేయడానికి నాపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించడం చూసి వారి కుట్రలు సాగనివ్వొద్దనే ఉద్దేశంతో సీఎం పోస్టుకు రాజీనామా చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే అవినీతిపై పోరాడాలనుకుంటే కేజ్రీవాల్ ను చూసి నేర్చుకోవాలి. మా మంత్రులతో సహా అవినీతి నాయకులను మేం జైలుకు పంపించాం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా అణగదొక్కాలో తెలియక పార్టీ కీలక నేతలు నలుగురిని ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు పంపించారు. ఆప్ పై విసరడానికి రాళ్లు మిగలక పోవడంతో టాప్ లీడర్లను జైలుకు పంపి నామరూపాలు లేకుండా పార్టీ చూశారని. అయితే, ఆప్ కేవలం పార్టీ కాదని, ఒక ఐడియాలజీ అని వివరించారు. ఆప్ ను ఎంతగా అణచివేయాలని ఆలోచిస్తే అంతగా పైకి ఎదుగుతుందని కేజ్రీవాల్ చెప్పారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను జైలు నుంచి బయటకు వస్తానని ఎవరూ ఊహించలేదని, అయితే, మీ అందరి ప్రార్థనల ఫలితంగా తనకు బెయిల్ వచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.