ముద్ర,సెంట్రల్ డెస్క్:- బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పై వేధింపులు వెల్లువెత్తాయి. బోస్ తనను వేధింపులకు గురి చేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. కోల్‌కతా రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉద్యోగానికి సంబంధించి గవర్నర్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాలలో వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తాడని.. కల్పిత కథనాలను చూసి తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. ఇలా తనను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే, గాడ్ బ్లెస్ డెమ్. కానీ, బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఆపలేరు బోస్.