ప్రముఖ గుణశేఖర్ ప్రస్తుతం యూత్‌ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా'తో దాదాపు ఉన్న సంగతి తెలుస్తుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతలపై తెరకెక్కుతున్న సినిమా అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. రీసెంట్‌గా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకణ పూర్తయింది. అదే ఎనర్జీతో మేకర్స్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇస్తూ సెట్స్ నుంచి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో అప్పటి స్టార్ హీరోయిన్ భూమిక మనకు కనిపించారు. సెట్స్‌లో ఆమె మేకప్ వేసుకోవటం, షూటింగ్‌లో పాల్గొనడం వంటి సన్నివేశాలను మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఆమె రాకతో ఆ సెట్స్‌కు మరింత ఉత్సాహం వచ్చింది.
ఈ గ్లింప్స్ వీడియోలో డైరెక్టర్ గుణశేఖర్‌ని కూడా మనం గమనించవచ్చు. 20 ఏళ్ల క్రితం గుణ శేఖర్, భూమిక సెన్సేషనల్ బ్లాక్ బస్టార్ 'ఒక్కడు' మూవీ కోసం కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. యుఫోరియా కోసం మరోసారి ఈ బ్లాక్ బస్టార్ కాంబో చేతులు కలిపింది. భూమికను దృష్టిలో ఉంచుకుని గుణశేఖర్ ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే పవర్‌ఫుల్ రోల్‌లో భూమిక ఎలా మెప్పించనున్నారోనని ఆసక్తి మరింత పెరిగింది.
ఇంకా ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్‌నేష్ గవిరెడ్డి, లికితా యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత, సాయిశ్రీనికా రెడ్డి, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్‌శ్ బాలకృష్ణ, రవి ప్రకా నాయుడు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాగిణి గుణ సమర్పణలో యుఫోరియా నీలిమ గుణ నిర్మాణారు. ప్రవీణ్ కె.పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రం ప్రవీణ్ పూడి ఎడిటర్. కాల భైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.