శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై అల్లు అర్జున్(అల్లు అర్జున్)హీరోగా తెరకెక్కిన 'ఆర్య'తో మొదలుకొని మొన్న సంక్రాంతికి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'(సంక్రాంతికి వస్తున్నాం) వరకు ఎన్నో హిట్ చిత్రాలను అందించారు నిర్మాత దిల్ రాజు(దిల్ రాజు).గత కొన్ని రోజుల నుంచి ఆయనపై ఐటి దాడులు జరుగుతున్నాయి. విషయం తెలిసిందే.దిల్ రాజు ఇల్లు,కార్యాలయం,బంధువుల ఇల్లు లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడుల గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడటం పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాపై ఐటీ దాడులు జరిగాయి.మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి.ఇందులో రాజకీయ కుట్ర ఉందనే వార్తలు కొన్ని మీడియా సంస్థల్లో ప్రసారం అవుతున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు.ప్రాసెస్ లో భాగంగానే ఐటి దాడులు జరుగుతున్నాయి కదా. . మైత్రి,అభిషేక్ వాళ్ల మీద కూడా జరుగుతున్నాయి.నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయని, కీలక డాక్యుమెంట్లు దొరికాయని వార్తలు వస్తున్నాయి.ఆ వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు.మా దగ్గర ఏమి లేవని,అధికారులే ఆశ్చర్యపోతున్నారు. నా ఇంట్లో,నా కూతురు,తమ్ముడి ఇంట్లో కలిపి 24 లక్షలు ఉన్నాయి ఐటి వాళ్ళు పేర్కొన్నారు.ఐదు సంవత్సరాల నుండి ఎక్కడ ప్రాపర్టీస్ కొనడం గాని, ఇన్విస్ట్మెంట్ లు చెయ్యడం గాని జరగలేదు.
ఒక సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లావాదేవీలు ఏ విధంగా జరుపుకుంటారో అని అడిగిన డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది.ఇక మా మదర్ హెల్త్ విషయంపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి.లంగ్ ఇన్ఫెక్షన్ పెరగడంతో జలుబు లాగా.దాంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.ఈ రోజు ఎలాంటి డిచ్ఛార్జ్ అవుతుంది.ఇక 2025 నుంచి ఎలాంటి సూపర్ హిట్ అవుతుంది. లు కొట్టాలనేదే నా పని అని చెప్పుకొచ్చాడు.