Home ఆంధ్రప్రదేశ్ 14 ఏపీ కేబినెట్ చర్చ.. అన్నిటికీ ఆమోదం – Prajapalana News

14 ఏపీ కేబినెట్ చర్చ.. అన్నిటికీ ఆమోదం – Prajapalana News

by Prajapalana
0 comments
14 ఏపీ కేబినెట్ చర్చ.. అన్నిటికీ ఆమోదం


అమరావతి, జనవరి 2 (ఈవార్తలు): ఏపీ కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా14 అంశాలపై చర్చ జరుగగా అందరికీ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రోత్సాహకాల బోర్టు తెలిపిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచింది . అమరావతిలో రూ. 2,733 కోట్ల పనులకు, రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిజర్వ్ నిర్మాణం, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం. నంద్యాల, కడప, కర్నూల్‌ జిల్లాలో పవన్, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు.. రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేసే 500 పీబీజీ ప్లాంట్లకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం లభించింది. సీఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు, భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారాన్ని మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్టసవరణకు అనుమతి ఇచ్చింది.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటు

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం. తిరుపతిలో ఉన్న 50 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని వంద పడకలు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ కేబినెట్‌ సమ్మతించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్‌, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌, నారా లోకేష్‌ చేపట్టారు.

నో కాస్ట్ EMI | నో కాస్ట్ ఈఎంఐతో లాభాలున్నాయా.. నష్టాలున్నాయా..
గుడిలో ప్రదక్షిణలు చేయాల్సిన సరైన విధానం ఇదే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech