డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో రిలీజ్ అయి మొదటి షోకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ 'పుష్ప2'. అతివేగంగా 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా, అతివేగంగా 1000 కోట్ల కబ్‌లో చేరిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప2 ఇప్పుడు భారత దేశ సినీ చరిత్రలోనే కేవలం 14 రోజుల్లో 1500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రికార్డులకెక్కింది. అంతేకాదు, ఇప్పటివరకు వివిధ ఇండస్ట్రీల్లో ఉన్న రికార్డులను క్రాస్ చేయడమే కాకుండా కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
హిందీ మూవీ 'స్త్రీ2' చిత్రం లాంగ్ రన్‌లో కలెక్ట్ చేసిన మొత్తం రూ.608 కోట్లు కాగా, ఇప్పుడు దాన్ని క్రాస్ చేస్తూ రూ.632.5 కోట్లతో హిందీ సినిమా కలెక్షన్స్‌లో కొత్త రికార్డు క్రియేట్ పుష్ప2 చేసింది. అంతేకాదు, ముంబైలో రూ.200 నెట్ కలెక్ట్ చేసిన సినిమా ఇప్పటివరకు లేదు. ఆ ఫీట్‌ను ఈ సినిమా ఎంతో సునాయాసంగా ఉంది. ఆ విధంగా బాలీవుడ్ సినిమాలకు ఒక కొత్త రికార్డును సెట్ చేసింది. 2024లో హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప2 ఓ రికార్డును సృష్టించింది.