30
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రం కమాన్లోని ఉమ్యాజీ హోటల్లో కుళ్ళిన, వాసన పట్టిన సమోసా, పకోడి, కార, బూందీ కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నట్లు ఫిర్యాదు రావడంతో మున్సిపల్ అధికారులు సోమవారం ఆ హోటల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్బంగా మున్సిపల్ శానిటేషన్ స్పెక్టర్ శివ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి సమోసా, పకోడి తదితర పదార్థాలను పరిశీలించారు. సమోసాలు కుళ్లి , నల్లగా అయినట్లు, ఇతర ఆహార పదార్థాలు కూడా అలాగే ఉండటం వల్ల మొదటి సారి తప్పుగా గుర్తించబడింది. 2 వేల జరిమానా వేసినట్లు హెల్త్ ఆఫీసర్ శివ కుమార్ తెలిపారు. కుళ్లిన పదార్థాలను పడేశారు. ఇక ముందు ఇలా నాణ్యత లేకుండా ఎలాంటి పదార్థాలు విక్రయించబడవు అని హోటల్ యజమాని నిశ్చయించుకున్నారు.