- ఢిల్లీలోని ఏపీ భవన్ తరహా నిర్మాణం!!
- ఐదు గ్రామాలను కోరిన తెలంగాణ… ఏపీ సానుకూల స్పందన?
- విద్యుత్ బకాయిలపై ఇరు రాష్ట్రాల చర్చ
తెలంగాణ, హైదరాబాద్లోని కొన్ని భవనాలను ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చినట్లుగా చూపుతోంది. హైదరాబాద్లోని స్థిరాస్తులను ఏపీకి ఇచ్చేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే ఢిల్లీలోని ఏపీ భవనాల తరహాలో హైదరాబాద్లో భవనం కట్టుకోవడానికి అనుమతిని ఇస్తున్నట్లు చెప్పారు. భూమి కోసం ఏపీ అర్జీ పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం ముగిసింది. అయితే తెలంగాణ పలు డిమాండ్లను ఏపీ ముందు ఉంచినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమకు రూ.24 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏపీ కోరగా… తెలంగాణ నిరాకరించిందని అంటున్నారు. అలాగే, హైదరాబాద్లోని ఆస్తులను ఇచ్చేందుకు నిరాకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐదు గ్రామాలు… ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తమపట్నంలలో తమకు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజ్ఞప్తికి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా ఉంది.
ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో ఆస్తుల పంపకాలపై, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ సంస్థల పంపకాలు, ఫైనాన్షియల్ కార్పోరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో పదిహేను ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి… ఇందుకు సంబంధించిన అప్పులు, ఉమ్మడి సంస్థలకు ఖర్చులు, చెల్లింపులపై చర్చించారని సమాచారం. ఉద్యోగుల విభజన గురించి కూడా చర్చించారు.