- 30 అడుగుల ఎత్తులో కారిడార్
- నేషనల్ హైవే అథారిటీ నిర్ణయం
- మన్ననూరు నుంచి పాతళగంగ వరకు విస్తరణ
- 147 హెక్టార్ల భూమి
- నల్లమల ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు ఆటంకాలు లేకుండా పనులు
- భూమి కోసం అధికారుల నివేదిక
- అరణ్య భవన్‌లో వైద్య శాఖ, కేంద్ర రవాణా శాఖ ప్రత్యేక భేటీ
- 55 భారీ ఫ్లైఓవర్‌కు సైతం ప్రతిపాదనలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :హైదరాబాద్–-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణకు అడుగులు పడుతున్నాయి. 765 జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. అయితే ఈ హైవేను విస్తరించేందుకు ప్రాజెక్టును చేపడుతున్నారు. దీంతో ఈ హైవేలో 30 అడుగుల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్లాన్ చేశారు. ఈ ప్రాంతంలో జంతువులకు ఇబ్బంది లేకుండా దీనిని నిర్మించనున్నారు. హైదరాబాద్–-శ్రీశైలం హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విస్తరణ కోసం 147.31 హెక్టార్ల భూసేకరణ అవసరమని అంచనాలు సిద్ధం చేయాలి.. హైవే విస్తరణ ప్రాజెక్ట్ నల్లమల ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వు మీదుగా వెళుతోంది. ఈ అనుమతుల కోసం రాష్ట్రశాఖతో కేంద్ర గృహ రవాణా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సమావేశమయ్యారు.
త్వరగా నిర్మాణం
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణపై కేంద్ర రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టిసారించింది. హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ కోసం 147.31 హెక్టార్లు భూమి అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు నల్లమల ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వు మీదుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ, ఇండియా అధికారులు రాష్ట్ర శాఖతో సమావేశమయ్యారు.
రోడ్డు విస్తరణ ప్రాజెక్టు గురించి వారికి వివరించారు. అరణ్యభవన్‌లో జరిగిన ఈ సమావేశశాఖ నుంచి పీసీఎఫ్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఎలూసింగ్ మేరు, పలువూరు. హైవే -756లో హైదరాబాద్ – శ్రీశైలం సెక్షన్ మధ్య ప్రస్తుత ట్రాఫిక్, రానున్నకాలంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని 2 వరుసల 4 లెన్‌లుగా విస్తరించే ప్రణాళికను వారికి వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని మిగిలినచోట భూభాగంలోనే రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు. ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ మార్గం^ -శ్రీశైలంలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డువిస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
ఈ భూమి ఇవ్వండి
మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి ప్రాంతం నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ వరకు జాతీయ రహదారి విస్తరణ చేపడతారు. పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ. మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక కాగా ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని కేంద్ర రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్టేషన్‌శాఖకు వివరించారు. రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూమిపై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేసి నల్లమల ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో భూమి కావాలని అధికారులు శాఖకు తెలిపారు.
కాగా, ప్రతిపాదనలు ప్రాథమికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు మధ్య రాకపోకలను రాత్రి 9 నుంచి ఉదయం 6వరకు అనుమతి లేదు. రాత్రివేళలో వణ్యప్రాణులు తిరగేదాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మిస్తే ఎలివెటెట్ కారిడార్ మీదుగా వాహనాలు 24గంటలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వివరించారు.
లైటింగ్‌లో అధికంగా ఉంటే వణ్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేట్ కారిడార్‌పై రాత్రివేళ తక్కువ లైటింగ్ ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర రవాణా, ఎన్‌హెచ్‌ఐ అధికారులు ప్రెజంటేషన్ విన్న వెంటనే అధికారులు పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. నల్లమల ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఎక్కువ చెట్లు కొట్టివేయకుండా తక్కువ నరికేలా చూడాలని రోడ్లు విస్తరణ ప్రణాళికలో పలు మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం.
భారీ వంతెన
అయితే, ఈ మార్గంలో 55 పొడవైన భారీ వంతెన నిర్మాణం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చితే మన్ననూరు చెక్‌పోస్టు నుంచి ఏకంగా ఈ 55 వంతెన ద్వారా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లవచ్చు. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. హైదరాబాద్–-శ్రీశైలం మార్గంలో ఘాట్ రోడ్డు మొదలయ్యే ప్రాంతం నుంచి ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించారు. అంటే మన్ననూరు చెక్‌పోస్టుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచే కారిడార్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దోమలపెంట తర్వాత వచ్చే పాతాళగంగ (తెలంగాణ సరిహద్దు) వద్ద ముగిసేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
ఈ కారిడార్ ఘాట్ రోడ్డులో దట్టమైన అమ్రాబాద్ అభయారణ్యం మీదుగా సాగుతుంది. జనావాసాలు ఉన్న మన్ననూరు, దోమలపెంటల బైపాస్‌లను, మూలమలుపులు ఉన్న చోట నేరుగా వంతెన వెళ్లేలా ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదన సాకారం అయితే 55 రాష్ట్రంలోనే అతిపెద్ద వంతెన అవుతుంది. దీని నిర్మాణానికి అంచనా వ్యయం రూ.7 వేల కోట్లు. మన్ననూరు–-ఫర్హాబాద్ జంగల్ సఫారీ-వట, వర్లపల్లి, -దోమలపెంట మీదుగా సాగనుంది. కేంద్రం ఆమోదం రాగానే డీపీఆర్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాలు…
మొత్తం దూరం 62.5 కి.మీ
ఈ ప్రాంతంలో 56.2 కి.మీ
ప్రాంతంలోయేతర ప్రాంతంలో 6.3
ఘాట్ సెక్షన్ రోడ్డు విస్తరణ 14.6 కి.మీ
భూభాగంపై విస్తరించే మార్గం 47.9 కి.మీ
ప్రాంతం 128.63 హెక్టార్లు
ప్రాంతాలయేతర ప్రాంతం 18.68 హెక్టార్లు