ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప-2' మేనియా ప్రారంభమైంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్లను నిర్వహించడం సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే హైదరాబాద్ ఈవెంట్ పై కొద్దిరోజులుగా సస్పెన్స్. పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడం, వేదికలు లేకపోవడం వంటి కారణాలతో.. అసలు ఈవెంట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పుష్ప-2 హైదరాబాద్ ఈవెంట్ కి వేదిక, తేదీ ఖరారైనట్లు. (పుష్ప 2 రూల్)
డిసెంబర్ 1న మల్లారెడ్డి కాలేజ్‌లో ఘనంగా 'పుష్ప-2' వేడుకను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారట. ఈ వేడుకకు పోలీసుల అనుమతి కూడా లభించినట్లు సమాచారం. కాలేజ్ స్టూడెంట్స్, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగే ఈ ఈవెంట్ కి చాలా సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చీఫ్ గెస్ట్ ఎవరు? అనే దాని గురించి ఇంకా సమాచారం లేదు. చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వచ్చినా ఆశ్చర్యంలేదని ఇటీవల ప్రచారం జరిగింది. మరి నిజంగానే చిరంజీవి వస్తారా లేక మరెవరైనా వస్తారా? అసలు చీఫ్ గెస్ట్ తోనే సంబంధం లేకుండా, అల్లు అర్జున్ తన బ్రాండ్ తోనే ఈవెంట్ నింటారా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే పోస్ట్ సమాచారం ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా పాట్నా, చెన్నై, కొచ్చి ఈవెంట్లకు వెళ్లలేకపోయిన సుకుమార్.. హైదరాబాద్ ఈవెంట్ రానున్నాడని.