30
హైదరాబాద్ నగరంలో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాన జోరందుకుంది. దీనితో పలు ప్రాంతాలు మాదాపూర్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి జలమయం అయ్యాయి.
అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆబిడ్స్, కోటి, ఎల్‌బీనగర్, ఉప్పల్‌లోనూ భారీ వర్షం పడుతోంది. గణేష్ మండపాల దగ్గర వర్షంలో తడుస్తూనే భక్తుల పూజలు చేస్తున్నారు. ఇక 2 గంటలపాటు భారీ వర్షం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్లనుంచి బయటకు రావాలని సూచించింది.