32
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సిఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు ఈరోజు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన సిఎం బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.