Home తెలంగాణ హైడ్రా జోలికి వస్తే అంతుచూస్తా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

హైడ్రా జోలికి వస్తే అంతుచూస్తా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
హైడ్రా జోలికి వస్తే అంతుచూస్తా - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • నియంత్ర పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాం
  • గడిచిన పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో మగ్గింది
  • విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నాం
  • తెలంగాణ హక్కుల సాధన కోసమే నా ఢిల్లీ పర్యటనలు
  • నిధులు, వాటా కోసం ఎన్నిసార్లయినా హస్తినకు వెళ్తా
  • భూ మాఫియాను ఎట్టిపరిస్థితిల్లోనూ వదిలిపెట్టను
  • హైదరాబాద్ భవిష్యత్తు కోసమే హైడ్రా
  • తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవ్వరూ తప్పుపట్టవద్దు
  • సెప్టెంబర్ 17 ఇకపై ప్రజా పాలన దినోత్సవం
  • ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కొట్లాడి.. తెలంగాణ రాష్ట్రం గడిచిన పదేళ్లు నియంత పాలనలో మగ్గిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నామన్న ఆయన రైతులు, కార్మికుల సంక్షేమం దిశగా తమ పాలనను స్పష్టం చేశారు.తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవ్వరూ తప్పుపట్టకుండా హితవు పలికిన సీఎం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తుచేశారు.తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానమని అభివర్ణించారు. మంగళవారం రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పబ్లిక్‌గార్డెన్స్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం జాతీయజెండాను ఆవిష్కరించారు.

అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అస్థిత్వం అంటే కుటుంబ పాలన కాదనీ స్వరాష్ట్రంలో బాధ్యతాయుత పాలన ఉండాలని అభిప్రాయపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై విపక్ష నేతలు చేస్తోన్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. తన స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో తాను ఢిల్లీ వెళ్లడం లేదన్న ఆయన తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తారని స్పష్టం చేశారు. ఢిల్లీ భారతదేశంలోనే ఉందనీ మరో దేశంలో లేదనే పరిశీలనతెలుసుకోవాలని చురకలంటించారు. ఇది ఫెడరల్ వ్యవస్థ అని రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉన్నాయి. కేంద్రం నుంచి రావలసిన ప్రతి పైసా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని.

ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా తమ వాదనలు గట్టిగా వినిపించమన్న సీఎం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణనుప్రపంచ వేదికపై 'ఫ్యూచర్‌ స్టేట్‌' గా బ్రాండ్‌ చేస్తున్నామన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలలో ఇది వ్యూహాత్మక ప్రయత్నమన్నారు. తాను ఫామ్‌హౌస్ సీఎంను కాదనీ పని చేసే ముఖ్యమంత్రిని అని వివరణ ఇచ్చారు. ఓ నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు ప్రజలకు భరోసా ఇస్తామన్న ఆయన పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు.గత పాలకులు తెలంగాణ సంస్కృతిని, అస్థిత్వాన్ని తమ ఇంటి సంస్కృతిని, కుటుంబ అస్థిత్వంగా భావించారని గుర్తు చేశారు. వారి పాలనలో తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని భ్రమించారని బీఆర్ ఎస్ పాలన తీరుపై ఉంది. అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికానన్న సీఎం అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టామన్నారు

ఇకపై ప్రజా పాలన దినోత్సవం..!

అక్షరవీరులు ఒకవైపు, సాయుధ యోధులు మరో వైపు సాగిన పోరాటంలో 76 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ రాజ్యం స్వేచ్ఛ పొందిందని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాంతానికో.. ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదన్న సీఎం.. సెప్టెంబర్ 17న కొందరు వివాదస్పదం చేస్తున్నారు. అందుకే ఆ రోజున ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి.. విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం రాజకీయం చేయడం సరికాదని విపక్షాలకు హితవు పలికారు. అందరూ కలిసి ఉంటారని చెప్పేందుకు సూచిక బిగించిన పిడికిలి అని అభివర్ణించారు. పెత్తందార్లు, నియంతలపై పిడికిలి బిగించి పోరాటం చేశామని. నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు భరోసా ఇచ్చామని ఆ మేరకు పాలన కొనసాగిస్తున్నామన్నారు. ఈ ఏడాది డిసెంబరు 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం పునరుద్ఘాటించారు.

లేక్ సిటీని ఫ్లడ్ సిటీగా మార్చారు.!

లేక్‌సిటీగా ఉన్న హైదరాబాద్‌ ఫ్లాడ్‌ సిటీగా దిగజారడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి. కేరళ లాంటి దుస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూసేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని ప్రకటించారు. హైడ్రా జోలికి వచ్చిన వారి అంతుచూస్తానని సీఎం ప్రకటించారు. హైడ్రా ఒక పవిత్ర కార్యమని,దీని ఏర్పాటు, కూల్చివేతల వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందని, ఇది తన భరోసా అన్నారు. అలాగే హైడ్రాను బెదిరిస్తున్న భూ మాఫియాను వదిలిపెట్టబోమని హెచ్చరించిన సీఎం.. చెరువులు, కుంటల్లో నిర్మించిన భవనాల కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే ఉంది. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్తామన్నారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరుపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను సీఎం కొట్టిపారేశారు. రువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్లలో కట్టిన బిల్డింగ్ లు ఎంతపెద్ద వారివైనా కూల్చేస్తామన్నారు. ఈ విషయానికి సంబంధించి హైడ్రా ఇప్పటికే చాలా ఆక్రమణదారులకు, బడాబాబులకు నోటీసులు ఇచ్చారు. హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అధికారుల పనిలో తమ జోక్యం ఉండదని వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech