Home తెలంగాణ హైడ్రా చేతిలో చిట్టా… అధికారులు ఎవరు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

హైడ్రా చేతిలో చిట్టా… అధికారులు ఎవరు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
హైడ్రా చేతిలో చిట్టా... అధికారులు ఎవరు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో అనుమతులిచ్చిన వారు ఎక్కువ
  • బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ పర్మిషన్లు
  • ఇప్పటికే ప్రాథమికంగా జాబితా రెడీ చేసిన హైడ్రా
  • జీహెచ్‌సీ నుంచే ఎక్కువ
  • హైడ్రా, జీహెచ్‌ఏకా మధ్య పోరు
  • అధికారులను ఇరికిస్తున్నారంటూ విమర్శలు
  • చర్యలు తీసుకోవాల్సిందేనంటూ హైడ్రా పట్టు
  • సీఎం కూడా సిద్ధమే
  • ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసు
  • కేసుల జాబితా 200కుపైగా పెరిగే ఛాన్స్..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :-అవినీతి అధికారుల భరతం పట్టేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాలను బ జోన్, ఎఫ్ టిఎల్ పరిధిలోని ప్రాంతాల నిర్మాణాలను వారి జాబితాలో జిహెచ్‌సి అధికారుల సంఖ్యలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధికారుల చిత్తాను రూపొందించిన పనిలో హైడ్రా నిమగ్నమైందని సూచిస్తుంది. ఇప్పటికే ప్రాథమికంగా జాబితాను తయారు చేయగా…అందులో విస్తూ పోయే నిజాలు వెలుగు చూస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా అవినితి అధికారుల జాబితాలో సుమారు రెండు వందల మందికి పైగా ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేసిన అధికారుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే బఫర్ జోన్, ఎఫ్ టిఎల్ ప్రాంతాల్లో వెలిసిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపూతోంది.

ఎవరూ అడ్డువచ్చినా….తగ్గేదెలా అంటూ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. దీని వల్ల ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెనకడుగు వేయడం లేదు. సొంత పార్టీ (కాంగ్రెస్) నుంచి అంతర్గతంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సీఎం కూడా వెనకకు చూడడం లేదు. పైగా హైడ్రాను రోజురోజుకు బలోపేతం చేసుకుంటూ పోతున్నారు. దానికి పూర్తి స్థాయిలో అధికారాలను కట్టపెడుతున్నారు. దీంతో హైడ్రామా అధికారులు అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశమే రాష్ట్రంలో కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా సాగుతోంది.

ఇక ప్రభుత్వ అధికారుల మధ్య హైడ్రా పనులు చిచ్చు పెడుతున్నాయి. నిజానికి గ్రేటర్ జీహెచ్‌సీకి అనుబంధంగానే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. కానీ దానికి కట్టబెడుతున్న అధికారాలతో హైడ్రా చెలరేగిపోతుండగా…. గ్రేటర్ బల్దియా దాని కూనరిల్లుతున్నట్లుగా. ఈ నేపథ్యంలో ఇటీవలే గ్రేటర్ కమిషనర్ హైడ్రాపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ బల్దియా జీతాలు తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తామంటే కుదరదని కుండబద్దలు కొట్టిన చందంగా ఆమె జరిగింది. దీంతో ఇది హైడ్రా వర్సెస్ గ్రేటర్ బల్దియా అన్న చందంగా మారినట్లుగా మారింది.

ప్రస్తుతం హైడ్రా, గ్రేటర్ మధ్య పోరు రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. కాగా అక్రమంగా అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై ఇప్పటికే హైడ్రా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మునుముందు ఈ కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని తెలుస్తోంది. ఇంతకుముందు అనుమతులు జారీ చేసిన అధికారులంతా ప్రస్తుత అధికార పార్టీలోని ముఖ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఎవరి మాట వినకుండా ముందుకు సాగుతుండడంతో అధికార పార్టీ నేతలు ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు పోతాయే అన్న ఆందోళన కూడా వారిలో ఉంది.

ఇదే సమయంలో అధికారుల వెనక ఉన్న నేతలను కూడా వదిలిపెట్టమని హైడ్రా చీఫ్ రంగనాథ్ చెబుతుండడంతో తాజాగా రాజకీయ నాయకుల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి.అక్రమ అధికారులలో వారి వెనుక ఎవరైనా విచారణలో తేలింది. దీంతో హైడ్రా పేరు వెంటనే ఇటు అక్రమంగా అనుమతులు జారీ చేసిన అధికారులు….అందుకు ఒత్తిడి తెచ్చిన రాజకీయ నేతలకు చెమటలు పడుతున్నాయని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech