7
గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ ప్రముఖ సినీ నటి హేమ(హేమ)అక్కడి పోలీసులకి పట్టుబడిన వార్త తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.నేను డ్రగ్స్ తీసుకోలేదని హేమ ఎన్నో వీడియోలు కూడా చెప్పింది.కానీ ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ బెంగుళూరు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన హేమని అరెస్ట్ చెయ్యడం కూడా చేసారు.
దీంతో హేమ బెంగుళూరు హైకోర్టులో ఒక పిటిషన్ వెయ్యడం జరిగింది.తనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివెయ్యాలని,తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొంది.ఇప్పుడు ఈ కేసులో బెంగళూరులో హైకోర్టు స్టే విధించింది.పోలీసులు ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.