చిరంజీవి(చిరంజీవి)హీరోగా 1998లో వచ్చిన చూడాలని చిత్రం బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన నటుడు తేజ సజ్జా(తేజ సజ్జా)ఆ తర్వాత దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలందరి సినిమాల్లో నటించి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు.జాంబీ రెడ్డి, హనుమాన్ చిత్రాలతో సోలో హీరోగా కూడా మారిపోయాడు. సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతున్నాడు.ముఖ్యంగా హనుమాన్ తో అయితే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్స్ ని కూడా సృష్టించాడు.
రీసెంట్ గా అబుదాబి సినీ వేదికగా నటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఐఫా'(iifa)అవార్డు కార్యక్రమం జరిగింది.ఈ రానాతో పాటు తేజ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.ఇందులో రానా,తేజ కలిసి హీరోలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై తేజ మాట్లాడుతూ చిన్నప్పట్నుంచి ఇండస్ట్రీలోనే ఉంటాడు అందరి హీరోలతో పని చేస్తూ పెరిగాను.వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశ్యం లేదు.అసలు ఆ ఆలోచన కూడా రాదు. వాళ్ళతో మంచి అనుబంధం కూడా ఉంది.మా వ్యాఖ్యలని సరిగా అర్ధం చేసుకోక పోవడం వల్లే తప్పుగా అనుకుంటున్నారు.
అదొక జాతీయ స్థాయి వేడుక. కంటెంట్ కోసం ఎంతో మంది స్క్రిప్ట్ రైటర్స్ వర్క్ చేస్తున్నారు.అన్ని విధాలా చెక్ చేసుకున్న తర్వాత మాకు స్క్రిప్ట్ లు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కట్ చేసిన క్లిపింగ్స్, ఫుల్ వీడియో చూస్తే ఎవరికి నెగిటివ్ ఉద్దేశ్యం రాదు.రానా నాపై జోకులు వేసాడని అందరకీ అర్దమవ్వడంతో జోక్ గానే చూసారు. అవకాశం వస్తే మరోసారి ఆ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా ఉంటానని చెప్పుకొచ్చాడు.