వెబ్ సిరీస్ : హరికథ
నటీనటులు: రాజేంద్రప్రసాద్, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, శ్రీరామ్ రెడ్డి పొలసాని, శ్రియ కొట్టం, విక్రమ్ సవ్యసాచి, శ్రీరామ్, అంబటి అర్జున్, దివి, నిర్వహించారు.
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: వివేక్ కూచిభట్ల, కృతి ప్రసాద్
దర్శకత్వం: మ్యాగీ
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
అరకులో ఓ చిన్నపిల్లాడు దారుణంగా హత్యలు చేసాడంటూ కోర్టులో ప్రెజెంట్ చేయగా.. అతని బాల నేరస్తుల జైలుకి పంపమని కోర్టు తీర్పు ఇస్తుంది. ఇక దారిలో వస్తుండగా ఆ బాలుడు ఓ కానిస్టేబుల్ ని అతిదారణంగా చంపేస్తాడు. మరోవైపు అరకులో రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) బృందం నాటకాలు ఆడుతూ ఉంటారు. ఆయన దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కోరోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన ఏ అవతారం గురించి అయితే నాటకాన్ని ప్రదర్శించాడో, ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతారు. ఆ ఊరికి చెందిన వ్యక్తులు అలా దారుణంగా చంపబడుతూ ఉండటం వల్ల అందరిలో భయాన్ని కలిగిస్తుంది. అక్కడ భరత్ (అర్జున్ అంబటి) పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అతనికి స్వాతితో పెళ్లి కుదురుతుంది. ఆ సమయంలోనే విశాఖ నుంచి అతని స్నేహితుడు (శ్రీరామ్) అక్కడికి వస్తాడు. తన భార్యను కోల్పోయిన అతను, కూతురు స్వీటీని వెంటబెట్టుకుని భరత్ ను వెతుక్కుంటూ వస్తాడు. ఒకరోజున భరత్ అనూహ్య రీతిలో చనిపోతాడు. రంగాచారి వేస్తున్న నాటకాలకు, జరుగుతున్న హత్యలకు మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం పోలీస్ ఆఫీసర్ కి కలుగుతుంది. అప్పుడు అతనేం చేస్తాడు? హత్యల వెనక ఉంది రంగాచారినేనా? హత్యలకి కనిపిస్తున్న వాళ్లంతా అంతకుముందు ఏం చేశారనేది ఈ సిరీస్ కథ.
విశ్లేషణ:
సంభవామి యుగేయుగే.. సృష్టిలో అవినీతి భీకరంగా పెరిగినప్పుడు ధర్మం గెలవనిచోట. దానిని రక్షించేందుకు దేవుడు ఒక్కో అవతారం ఎత్తి అవినీతిని అంతం చేస్తాడు. ఇదే థీమ్‌తో ఈ 'హరికథ' మొత్తంగా ఆరు ఎపిసోడ్‌లుగా ఉంటుంది. యావరేజ్ గా ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాల వరకు, మొత్తంగా మూడు గంటల నిడివి ఉంటుంది. తెలిసిన కథలోనే మైథాలజి యాడ్ చేసి ప్రెజెంట్ చేసిన స్క్రీన్ ప్లే బాగుంది.
మొదటి ఎపిసోడ్ , రెండో ఎపిసోడ్ కాస్త నెమ్మదిగా సాగినా మూడు, నాలుగు, అయిదు ఎపిసోడ్ లో కథ పూర్తిగా ఎంగేజింగ్ గా సాగుతుంది. ఆరో ఎపిసోడ్ 'కల్కి' లో ట్విస్ట్ లు మనం ముందుగానే ఊహిస్తాం. అది మాములుగా అనిపిస్తుంది. అయితే ఈ సిరీస్ లో జరిగే హాత్యలు చూస్తే కాస్త ఎక్కువ రక్తపాతం చూపించారా అనిపిస్తుంది. ఒక్కో అవతారం ప్రెజెంటేషన్, దానికి బలమైన కారణం చెప్తూ కథని మలిచిన తీరు బాగుంది.
కథ మొత్తం 1990-92 మధ్యకాలంలో సాగడంతో .. ఆ టైం పీరియడ్‌లో గ్రామంలో జరిగే హత్యలు, వాటి తాలూకా భయం జనాల్లో ఎలా ఉంటుందో చూపించారు. అయితే ట్విస్ట్ లు కాస్త ఊహించే విధంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
రాజేంద్రప్రసాద్ నటన సినిమాకి ప్రధానబలంగా నిలిచింది. శ్రీరామ్ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దివి, మౌనిక, అంబటి అర్జున్ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా: ఎంగేజింగ్ మైథలాజికల్ థ్రిల్లర్.. మస్ట్ వాచెబుల్
రేటింగ్: 2.75/5
✍️. దాసరి మల్లేశ్