ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ,కుర్రకారు, అయ్యప్ప దీక్ష,గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సత్యా రెడ్డి. ఆయా చిత్రాలన్నింటిని తానే నిర్మించడమే కాకుండా ప్రధాన పాత్రలని కూడా పోషించి నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని రూపొందించాడు.
ఈ నెల 29న ఆ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సత్యారెడ్డి(sathya reddy)మాట్లాడుతు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేఖంగా ఈ సినిమా రూపొందించాను. వరల్డ్ వైడ్ గా మూడు వందల థియేటర్లలో మా సినిమా విడుదల చేసింది. దాంతో రిలీజ్ టైం అయ్యింది.మా సినిమా ద్వారా గద్దర్ కు నివాళి ఇస్తున్నాం. స్మగ్లర్ లను హీరోలుగా చూపించే సినిమాల కంటే సమాజానికి మేలు చేసే మా సినిమాని ఆదరించాలని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ మాటలు పరోక్షంగా పుష్ప 2(పుష్ప 2)ని ఉద్దేశించి చేశాడనే విషయం అర్థమవుతుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. గద్దర్ ఇందులో కీలక పాత్ర పోషించిన ఆయన నటించిన చివరి సినిమా కూడా ఇదే. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, ప్రైవేటీకరణకి వ్యతిరేఖంగా కూడా పోరాడిన వాళ్ళు ఇందులో నటించారు.