- ప్రజలకు అందుబాటులో ఉండే విధులు నిర్వహించాలి
- హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
- వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
ముద్ర,పానుగల్ :-సైబర్ నేరాల నివారణకు గ్రామాలలో అవగాన కార్యక్రమాలు నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా వనపర్తి జిల్లా పరిధిలోని పానుగల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.అనంతరం ఎస్పీ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్‌లో రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు. పోలీస్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు ఏవిధంగా ఉన్నవి తదితర వివరాలను పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను పానుగల్లు ఎస్సై, శ్రీనివాసులు ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. విధుల పట్ల అంకితభావం ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యతని ముందుగా చట్టాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు, పానుగల్ పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించినా వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. అక్రమ మార్గంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాల కోసం కృషి చేయాలన్నారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలని సూచించారు.
డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించేలా చూడాలని, అలాగే బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గ్యాస్‌టీ మేనేజ్‌మెంట్ సిబ్బంది ద్వారా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.
రాత్రి పెలింగ్ అధికారులు లాడ్జీలు మరియు పాత నేరస్తులను తనిఖీ చేసారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు .
సైబర్ నేరాల నియంత్రణ గ్రామాలలో పట్టణాలలో మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తరుచూ వాహనాల తనిఖీ, నాకాబంది వంటి డ్రైవ్‌లు చేపట్టి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఆయన అన్నారు.పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలని వారికి కేటాయించిన విధిని సక్రమంగా నిర్వహించినప్పుడే అధికారుల మన్ననలు పొందుతారని, పనికి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో క్రమ శిక్షణతో ఉండాలని, స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఫిట్ గా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ క్రిష్ణ ,పానుగల్ ఎస్సై, శ్రీనివాసులు, శిక్షణ ఎస్సై, దివ్యారెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.