Home తెలంగాణ సూర్యాపేటలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) రాష్ట్ర సభలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

సూర్యాపేటలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) రాష్ట్ర సభలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
సూర్యాపేటలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) రాష్ట్ర సభలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధం… H9/2014) రాష్ట్ర సభలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో సూర్యాపేటలో జరుగుతున్నట్లు టి యు డబ్ల్యూ జే ఐ జే వై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, అధ్యక్ష, జిల్లా, ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు, డాక్టర్ బంటు కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావులు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఏర్పాటు చేసిన టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు.

తమ యూనియన్ ఏర్పడిన 67 సంవత్సరాలుగా జర్నలిస్టుల పక్షాన అనేక సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న జర్నలిస్టుల హక్కులు, బాధ్యతల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేటలో గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలను ఆహ్వానించి రాష్ట్ర మహాసభలను సూర్యాపేటలో జరిపిన ఘనత తమ యూనియన్‌కు దక్కింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలో తొలిసారిగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ సౌకర్యం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనమైన పోరాట చరిత్ర ఐయు ది అన్నారు.

మూడవసారి కూడా రాష్ట్ర యూనియన్ సభలను సూర్యాపేటలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈసారి రాష్ట్ర సభలను విజయవంతం చేసేందుకు సహకరించాలని కూడా సూచించింది. ఇంకా ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, రెబ్బా విజయకుమార్, సిరికొండ సైదులు, కోశాధికారి తల్లాడ చందన్, ముషం హరి, ఫణి నాయుడు, వార్త శ్యాం కుమార్, దేవరశెట్టి వేణుమాధవ్, ఎంటీవీ నాగరాజుగౌడ్, బీ,ఎన్ మల్లేష్ గౌడ్ రామకృష్ణ గౌడ్, జనార్ధన చారి, మధు, కొండ్లె కృష్ణయ్య, శిరం శెట్టి ఆనంద్, బొల్లెద్దు వెంకటరత్నం, పల్లె మణి బాబు, నాగరాజు, రామకృష్ణ, నరేందర్, కొండా శ్రీనివాస్, ప్రవీణ్, జహీర్, రమేష్, వాసా చంద్రశేఖర్, రామచంద్ర రాజు, కాటం గౌడ్, సుమన్, శంకర్, శ్రీనివాస్ జరిగింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech