Home తెలంగాణ సుస్థిర ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి : పటేల్ రమేశ్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

సుస్థిర ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి : పటేల్ రమేశ్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
సుస్థిర ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి : పటేల్ రమేశ్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఘనంగా ప్రజాపాలన దినం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సమాదరిస్తూ శాంతిసామరస్యాలకు ప్రతీకగా నిలిచిందని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన నివాసులు ఏర్పాటు చేశారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణ పై ఆంక్షలు, మాతృభాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని చెప్పారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన గ్రామాలు, పట్టణాలతో ప్రభల విల్లుతున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందని చెప్పారు.

ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వినియోగించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3.54 కోట్ల మంది మహిళలకు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా మహిళలకు 69.98 కోట్లు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తు సరఫరాకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 1,56,670 గృహ విద్యుత్ కనెక్షన్లకు జీరో బిల్లు జారీ చేసినట్లు చెప్పారు. ఈ పథకం ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుకోట్ల కింద 84 లక్షల రూపాయల రాయితీని అందజేసిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,43,899 మంది వినియోగదారులకు 2 లక్షల 97 వేల 121 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం 8 కోట్ల 56 లక్షల రూపాయల రాయితీని అందించిందని చెప్పారు. రైతులకు పంట రుణాల మాఫీ2024 ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు.

జిల్లాలో రూ.646కోట్ల రుణ మాఫీ

కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 91 వేల 259 మంది రైతుల ఖాతాలలో 646 కోట్ల 47 లక్షల రూపాయలు జమ చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు జిల్లాలో 1,09,436 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్తును సరపర అందించబడుతుంది. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతర సరఫరా గురించి 25 కెవిఎ చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ శ్రీ పథకం కింద ఐదు లక్షల వరకు ఉన్న వైద్య ఖర్చుల పరిమితిని, 10 లక్షల రూపాయల వరకు తమ ప్రభుత్వం పెంచిందని తెలిపారు. అదనంగా ఆరోగ్యశ్రీ పరిధిలో 163 ​​వ్యాధుల చికిత్సలను చేర్చి మొత్తం 1,672 వ్యాధులకు చికిత్స అందిస్తే పేద ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల ఇల్లు 50 వేల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వ్యవసాయ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమీషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌లను నిర్మించారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు వీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎఫ్‌ఎఫ్ఓ నిఖిత, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, అధికారులు, మహిళలు, ప్రజలు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech