34
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివిధ సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమెకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.