32
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో కొన్ని రోజులుగా బెటాలియన్ పోలీసులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఉన్న బెటాలియన్ పోలీసులను అధికారులు తప్పించారు.ముఖ్యమంత్రి నివాసం వద్ద బందోబస్తులో ఉండే బెటాలియన్ పోలీస్ సిబ్బంది స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ సిబ్బందిని నియమించారు. సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ మార్పులను చేసింది, ముఖ్యమంత్రి ఇంటికి మూడు వైపులా ఉన్న 22 మంది టీజీఎస్పీ సిబ్బందిని మార్చారు. భద్రతను బలపరిచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.