27
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రధాని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేయబడింది. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని ట్వీట్ చేశారు. మోదీ బర్త్ డే విశేష్పై స్పందించిన రేవంత్ రెడ్డి.. “హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు” అని రీట్వీట్ చేశారు.