- ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది
- హైడ్రా పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
- ఢిల్లీకి కప్పం కట్టేందుకే సీఎం పర్యటన
- మూసీ ప్రక్షాళన జేబులు నింపుకునేందుకే..!
- రైతులను మోసం చేసిన సీఎంగా చరిత్రలో ఉంటారు
- బీజేపీ రైతుల పక్షపతి
- హైడ్రాను బంద్ పెట్టే రోజు త్వరలోనే వస్తుంది
- రైతు దీక్షలో బీజేపీ నేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆరాచకపాలన నడుస్తోందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజినిల ప్రవర్తిస్తూ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అన్ని సామాజిక వర్గాలను మోసం చేశారని, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూ తెలంగాణకు సర్కార్ కొడుతున్నారని, ఢిల్లీలో కప్పం కట్టేందుకు పనిచేసిన విస్తరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రినా? ఢిల్లీకి కప్పం కట్టే మంత్రినా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన జేబులు నింపుకోవడానికే తప్ప మరొకటి లేదని, కాంగ్రెస్ చరిత్రంతా అవినీతేనన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ధ బీజేపీఎల్‌పీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి నిరశన చేపట్టిన రైతు హామీల సాధన దీక్షను మంగళవారం విరమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, కౌలు రైతులు, కూలీలు, వరిధాన్యానికి రూ.500 బోనస్‌లు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్షను మంగళవారం ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యక్రమం ఇంఛార్జీ అభయ్ పాటిల్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. రైతు హామీల సాధన దీక్ష స్థలి నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై బీజేపీ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. అభయ్ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి గడువు ముగిసిందని, ఆయన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదని, తెలంగాణ తుగ్లక్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై పోరాటాలు పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ అభయ్ పాటిల్ పార్టీ శ్రేణులకు చేరుకుంది. సమస్యను వెతకాల్సిన అవసరం లేదు, అధికార పార్టీ వాళ్లే అనేక సమస్యలు సృష్టించి మనకు ఇస్తున్నారు.
ట్యాక్స్ వసూళ్లే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ట్యాక్స్‌ల పేరుతో రూ.కోట్లు వసూళ్లు చేసిందని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆర్, బీ ట్యాక్స్, ఆర్ఆర్ఆర్ ట్యాక్సీల అవినీతిని బయట పెట్టామని, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో పొంగులేటి కమీషన్, మేఘా కంపెనీల కమీషన్‌లు బయట పెట్టామన్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు మాటలను ఖండిస్తున్నామని, మోడీ ప్రభుత్వం రైతుల పక్షపతి అని తుమ్మలకు గుర్తు చేస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ రైతుల పక్ష పాతి అని, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కట్టేందుకు పనిచేస్తున్నారని, హైడ్రా పేరుతో వసూళ్లను కప్పి ఉంచారని, వసూళ్లు చేసిన డబ్బును ఢిల్లీకి కప్పం కడుగుతున్నారని.
సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు మొట్టికాయలు
సీఎం రేవంత్ రెడ్డి ఎవ్వరి మాట వినడం లేదని, ఎవరి మాట వినని వాడు సైకో అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైకోర్టు మొట్టికాయలు నేరుగా రేవంత్ రెడ్డికి తగిలాయని, చట్టం మీద గౌరవం ఉంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి శాసనసభలో అనేక సమస్యలపై ప్రస్తావించినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సత్తా, శక్తి భారతీయ జనతా పార్టీకే లేదని, ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడిందని. బేషరతుగా రూ.2 లక్షలు రైతుల ఖాతాలో జమ చేయాలని, లేదంటే నమ్మిన రైతులే ఈ ప్రభుత్వాన్ని బొందపెడతారని హెచ్చరించారు. రేవంత్ బ్రెయిన్ చైల్డ్‌గా ఉందని, హైడ్రా, మూసీ ప్రక్షాళనపై కోర్టు చివాట్లు పెట్టి, మొట్టికాయ వేసి ఉంది. నిజంగా రేవంత్ రెడ్డికి చట్టం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, కోర్టులు, జడ్జీలు అంటే లెక్కలేదా అని ప్రశ్నించారు.
అప్పుడూ.. ఇప్పుడు ఒకే పాలన : ధర్మపురి అరవింద్
గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకే విధానాన్ని అమలు చేసేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైడ్రా పేదల ఇళ్లనే కూల్చివేస్తుందని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని, జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చడం లేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల గోస కాంగ్రెస్‌కు గుర్తుచేసే దీక్ష ఇది అని, ప్రతి జిల్లాకు ఈ దీక్షలు తీసుకెళ్తామని చెప్పారు. హైడ్రాపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందే ప్రధాని నరేంద్ర మోడీ అని అరవింద్ పేర్కొన్నారు. పేదల ఇళ్లనే కూల్చి వేస్తున్నారని తెలిపారు. హైడ్రా పేరుతో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చడం లేదు
బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని, జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చడం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను మళ్లీ లేపే పని కాంగ్రెస్ పెట్టుకుందని. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ ఉందా? లేదా బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక, ఢిల్లీ పెద్దలు ఆరు గ్యారెంటీలను ప్రకటించారని, ఇప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ నేతలకు తెలియడం లేదని తెలిపారు. నమోదులో బీజేపీ దూసుకుపోతోందని, తెలంగాణలో అనుకున్న లక్ష్యం ప్రకారం నమోదును అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.