- ఈ నెల జీతంతో పండుగ అడ్వాన్సు ఒక్కొక్కరికి రూ.25 వేలు
- కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లింపుపై తక్షణమే విధివిధానాలు ఖరారు
- అధికారులకు సీఎండీ బలరామ్ ఆదేశాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ ను నెల 9వ తేదీన చెల్లించి ఆ సంస్ధ సీఎం బలరాం ఏర్పాటు చేశారు. సుమారు 42 మంది అధికారులు, కార్మికులతో పాటు మరో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకూ బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక సంవత్సరంలో వివిధ కాంట్రాక్టర్ల వారి వివరాలు, వారి పనిసేకరించాలని, ఎటువంటి లోటుపాట్లు పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.
ఒక్కొక్కరికి 25 వేల రూపాయల పండుగ అడ్వాన్స్ చెల్లించనున్నారు. దీని కోసం రూ.95కోట్లు కేటాయించినట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబరు నెల జీతాలతోపాటే ఈ పండుగ అడ్వాన్స్ సొమ్మును కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. లాభాల వాటా బోనస్, పండుగ అడ్వాన్సులు కలిపి దాదాపు రూ. 900 కోట్లు చెల్లించిన నేపథ్యం లో సింగరేణి సిబ్బంది వ్యవహారాలు, ఆర్థిక విభాగాలు తగు ఏర్పాట్లు చేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.ఇదీలావుంటే.. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులు పనిచేసిన పని దినాల సంఖ్యను తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. ఈ లెక్కన ఒక్కో కార్మికుడు సగటున దాదాపు రూ.1.90 లక్షల చొప్పున బోనస్ పొందే అవకాశం ఉంది.