Home తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

సర్కార్ సంక్రాంతి కానుక – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్..!



  • కొత్త రేషన్ కార్డులకు విధివిధానాలు ఖరారు
  • ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించిన అధికారులు
  • గత నిబంధనల్లో మార్పులు, చేర్పులు
  • ఆదాయ పరిమితి కొంత మేరకు పెంచే అవకాశం
  • వారంలోపు కేబినెట్ భేటీ.. అందులో నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రజలకు సర్కార్ సంక్రాంతి కానుక సిద్ధమవుతోంది. ఆ పర్వదినం రోజు నుంచి అర్హులైన పేదలకు కొత్తగా రేషన్‌ కార్డులు దరఖాస్తుల స్వీకరణకు ప్రజా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ఇప్పటికే వాటికి సంబంధించిన విడివిధానాలను దాదాపు ఖరారు చేసింది. ప్రస్తుతం అర్హులైన ఆదాయ పరిమితి పెట్టారు, ఇతర అర్హతలపై అధికారులు దృష్టి.

ఈ ఇతర రాష్ట్రాల ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఆదాయ పరిమితిని కొంత పెంచాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అదే విధంగా కొత్త జంటలకూ రేషన్ కార్డులు అందించిన నిర్ణయం తీసుకున్నది. మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన వారంలోపు రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించి ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు. పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది.

ఏడాది పాలన పూర్తి ప్రజా ప్రభుత్వం పాలనా పరంగా – రాజకీయంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ పై ఇటీవల విధాన పరంగా ప్రకటన వచ్చింది. కొత్తగా డిజిటల్ కార్డులను నిర్ణయించింది. అర్హత పైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా చిప్ తో ఉన్న డిజిటల్ కార్డులో పూర్తిగా లబ్దిదారుల సమాచారంతో కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ 1.50, పట్టణాల్లో రూ 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితి కొంత మేర పెంచాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

ఇందుకు గాను 2.82 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో లబ్ది దారుల సంఖ్య 32 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో, వీరికి మొత్తంగా కార్డులు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లకు చేరుతుంది. దీనితో, కొత్త కార్డుల జారీ పైన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆదాయ పరిమితి .. అర్హతలు, మార్గదర్శకాలు ప్రకటించబడతాయి. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి.. ఆ వెంటనే అందజేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech