- స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలి
- నవంబర్ 10లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- లేకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదు
- బీసీల కోసం బీఆర్ఎస్ కదిలింది
- జమిలి ఎన్నికలపై త్వరలో నిర్ణయం
- బీసీ నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటలకు పరిమితం కాకుండా వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు. నవంబర్ 10 లోగా 42 శాతం రిజర్వేషన్లు నిర్ణయించాలన్నారు. ఒకవేళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ హామీని నవంబర్ పదిలోగా నెరవేర్చుకుంటే భవిష్యత్తులో పార్టీ కోసం కార్యాచరణ చేపడతామన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీసీ నేతల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కేటీఆర్ మాట్లాడారు.
రానున్న రాష్ట్ర బడ్జెట్ లో కనీసం రూ.25 వేలు నుంచి రూ. 30 వేల కోట్లు బీసీల అభివృద్ధికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల కోసం ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉండాలన్నారు. అత్యంత వెనుకబడిన బలహీనవర్గాలు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని, వెంటనే ఆ శాఖకు మంత్రిని నియమించాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరే బీసీలు మంత్రులుగా ఉన్నారని, వారికి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 22 మంది పద్మశాలి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
చేప పిల్లల పంపిణీని నిలిపివేసిన ప్రభుత్వం ముదిరాజు సామాజికవర్గానికి ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. బీసీల కోసం బీఆర్ఎస్ కదిలిందని కేటీఆర్ అన్నారు. 2014, 2018, 2024 ఎన్నికల్లోనూ తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ,కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లను బలహీన వర్గాలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. గతంలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కడం. 50 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే 27 మంది బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చామన్నారు. బలహీన వర్గాల విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ విద్య అందుబాటులో ఉంచారు. బలహీన వర్గాల విదేశీ విద్యా నిధి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపివేసిందని ఆయన అనుకూలంగా ఉన్నారు. భవిష్యత్తులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు.
రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్దదిక్కుగా మా పార్టీ అధినేత కేసీఆర్ ఉంటారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను 24 గంటల్లో పూర్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుల గణన చేయడం పెద్ద కష్టమైన అంశమే కాదని కేసీఆర్ అన్నారు. కానీ చిత్తశుద్ధి లేకనే ఈ అంశం పైన ప్రభుత్వం ముందుకు వెళ్లడం సహాయం. త్వరలోనే బలహీన వర్గ సమస్యలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చింది. జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో కేంద్రం స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ కూడా జమిలి ఎన్నికలపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్.