ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్యా థియేటర్ ఘటనను ఎవరికి వారు ఇష్టానుసారం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయని. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర, పాత ఆంధ్రా పార్టీలు తయారయ్యాయని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు.
సంధ్య థియేటర్ ఘటనను ఎవరూ రాజకీయం చేయొద్దని సూచించారు. అంతకుముందు..అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టాం. తక్షణం కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలతో అంబేద్కర్ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ అని అన్నారు. బీజేపీ కుట్రపూరితంగా రాహుల్ గాంధీ క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.