Home సినిమా సంక్రాంతి సినిమాలు.. ఆడియన్స్ ఓటు దేనికి..? – Prajapalana News

సంక్రాంతి సినిమాలు.. ఆడియన్స్ ఓటు దేనికి..? – Prajapalana News

by Prajapalana
0 comments
సంక్రాంతి సినిమాలు.. ఆడియన్స్ ఓటు దేనికి..?


సంక్రాంతి అంటే తెలుగు సినీ ప్రియులకు నిజంగా పెద్ద పండగే. సంక్రాంతి సీజన్ లో పలు భారీ సినిమాలు విడుదలవుతాయి. ఈ ఏడాది సంక్రాంతికి కూడా మూడు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. జనవరి 10న 'గేమ్ ఛేంజర్', జనవరి 12న 'డాకు మహారాజ్', జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు థియేటర్లలో అడుగు పెట్టనున్నాయి. ఈ మూడు సినిమాలపైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాల ట్రైలర్లకు మంచి స్పందన లభించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా 'గేమ్ ఛేంజర్'. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడింది. పొలిటికల్ టచ్ డైరెక్టర్, శంకర్ తన శైలికి భిన్నంగా 'గేమ్ ఛేంజర్'ను ఒక పక్కా కమర్షియల్ సినిమాగా మలిచినట్లు ప్రచార చిత్రాలతో స్పష్టమైంది. ముఖ్యంగా ట్రైలర్ మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఉంది. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్, ఆ తర్వాత 'ఆచార్య'తో నిరాశ పరిచాడు. శంకర్ కూడా ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ వంటి ఈకీ 'గేమ్ ఛేంజర్' సక్సెస్ చాలా కీలకం. (గేమ్ ఛేంజర్)

హ్యాట్రిక్ విజయాలతో జోష్ లో ఉన్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న మూవీ 'డాకు మహారాజ్'. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎమోషనల్ టచ్ లో స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా 'డాకు మహారాజ్' తెరకెక్కింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజువల్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయనే పేరు వచ్చింది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, 'డాకు మహారాజ్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. (డాకు మహారాజ్)

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'ఎఫ్-2', 'ఎఫ్-3' సినిమాలు వచ్చాయి. అందులో 'ఎఫ్-2' బ్లాక్ బస్టర్ కాగా, 'ఎఫ్-3' పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇందులో.. భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే మాజీ పోలీస్ అధికారిగా వెంకీ మామ అలరించనున్నాడట. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ పై అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ ఎంటర్టైనింగ్ గానే ఉంది. వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా సంక్రాంతి సమయంలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఉంటుంది. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తాడో చూడాలి. (సంక్రాంతికి వస్తున్నాం)

ఈ సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలపైనా మంచి అంచనాలు ఉన్నాయి. మూడు సినిమాలూ వేటికవే ప్రత్యేకం. ట్రైలర్స్ కూడా మెప్పించాయి. మరి ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకి ఓటు వేస్తారో? వీటిలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో? చూడాలి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech