విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి,దిల్ రాజు కాంబోలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని అశేష ప్రేక్షాభిమానంతో ముందుకు దూసుకుపోతుంది.ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వెంకీ, అనిల్, దిల్ రాజు కెరీర్‌లోనే బిగ్గెట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది.వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి చేరిందంటే 'సంక్రాంతిలోకి వస్తున్నా' ' సాధించిన ఘన విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.
లేటెస్ట్ గా ఏపీ హైకోర్టులో 'సంక్రాంతికివస్తున్నాం' పై పిల్ నమోదైంది.సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు ప్రదర్శించారు.మొదటి రోజు 6 ఆటలు ప్రదర్శించి టికెట్ రేట్లు అధికంగా అమ్మారు.50 కోట్లు ఖర్చుతో తీసిన సినిమాకి హై బడ్జెట్ సినిమా అని చెప్పి రేట్స్ ,షోస్ ని ఎక్కువ వేశారు.కాబట్టి అదనపు షోలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని,ప్రభుత్వ ఖాజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి.ఐటీ, ఈడీతో విచారణ జరిపించాలని సదరు పిటిషనర్ తన పిల్ లో చేర్చాడు.దిల్ రాజు పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.