శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్‌లైన్‌లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్‌గా డూప్లికెట్ వెబ్‌సైట్‌లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్ వెబ్‌సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. “వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది.
మీరు వెంటనే మా ఫోన్ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్‌లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డిటెయిల్స్ పంపిస్తాం' అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు.