ముద్రణ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్: మౌలాలిలోని శ్రీరామానుజ మందిరంలో శుక్రవారం నాడు ఉచిత మెడికల్ సెంటర్.
శ్రీ రామానుజ సేవాట్రస్టు ఆధ్వర్యంలో జనహిత సేవా ట్రస్టు సహకారంతో ఈ వైద్య సేవా కార్యక్రమం ప్రారంభమైంది. రోజూ స్పెషలిస్టు డాక్టర్ దగ్గర వుంటూ ఇసిజి, ఎక్స్ రే, ప్రాథమిక రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తారు. జటిల ఆరోగ్య సమస్యలు ఉంటే అలాంటి వారిని పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేసి అండగా నిలుస్తామని రామానుజ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ తెలిపారు.
ఇటీవల మేడ్చల్ కు చెందిన ఒక పేద అర్చక పురోహితుడికి చిన్న ప్రేగు క్యాన్సర్ తో ప్రాణాపాయ స్థితి ఏర్పడితే ఐదు లక్షలకు పైగా ఖర్చయ్యే మేజర్ ఆపరేషన్ ఉచితంగా చేయించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ అర్చకుడికి 21 రోజులకు ఒకటి చొప్పున ఆరు సైకిల్స్ కీమో థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ట్రీట్‌మెంట్‌కు మొత్తంగా మరో ఐదు లక్షల వరకు వ్యయమౌతుంది. ఇంత భారం ఆయన మోసే పరిస్థతి లేదు. తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఈ ట్రీట్‌మెంట్‌కు కూడా రామానుజ సేవాట్రస్టే అండగా నిలిచిందని డాక్టర్ ధనుంజయ చెప్పారు.