ముద్ర న్యూస్ బ్యూరో ,హైదరాబాద్:- గుడిమల్కాపూర్ సమీపంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో డ్రోన్ కెమెరాల వాడకం వల్ల శబ్ద కాలుష్యం, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని, వాటి నుంచి తమను కాపాడాలని బాలాజీ నగర్ వాసులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. టపాసుల కాలుష్యం వల్ల తమ కాలనీవాసులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం నాడు కుల్సుంపురా ఏసిపి మహమ్మద్ మునావర్ ను, గుడిమల్కాపూర్ సిఐ బి రాజును కలిసి వివరించారు.
పోలీస్ అధికారులు సానుకూలంగా కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుడిమల్కాపూర్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు హామీ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, గుడిమల్కాపూర్ ట్రాఫిక్ సీఐ రంగయ్య శుక్రవారంనాడు గుడిమల్కాపూర్ మార్కెట్ పరిసరాలను పరిశీలించి ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు. కమీషన్ ఏజెంట్లతోనూ, ఇతర వ్యాపారులతో సమావేశమై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.