గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీని మరింత బలహీనపరిచేలా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్య నేతలను తమ పార్టీల్లో చేర్చుకునే కార్యక్రమాలను కూటమి నాయకులు వేగవంతం చేశారు. ముఖ్యంగా వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఇటు టిడిపి, అటు బిజెపి, జనసేన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు చాలా వరకు విజయం సాధించాయి అనేక జిల్లాల్లో నేతలుగా ఉన్న వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వివిధ పార్టీల్లో చేరిపోయారు. ఈ జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముందు వరుసలో ఉన్నారు. ఆయన గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి సాధించిన అనంతరం రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారు. కొన్నాళ్లపాటు మౌనం దాల్చిన ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించుకుని కొద్ది రోజుల కిందటే టిడిపిలో చేరారు. అలాగే భీమవరం మాజీ ఎమ్మెల్యే గాంధీ శ్రీనివాసరావు కూడా వైసిపికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఈయన తెచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఓటమి తర్వాత ఈయన సైలెంట్ అయిపోయారు. కొద్దిరోజులు కిందటే ఈయన ఆస్తులకు సంబంధించి ఈడీ దాడులు జరగడంతో.. పార్టీ మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇంకా స్పష్టత ఉన్నప్పటికీ జనసేన, టిడిపిలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా వైసిపికి రాజీనామా చేశారు. ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఈయన ఉన్నారు. ఈయన కూడా జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల్లో ఓటమి అనంతరం కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారు రోశయ్య, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు వైసిపికి దూరమయ్యారు. రానున్న రోజుల్లో ఈ పార్టీలో ఉన్న మరి కొందరు కాపు నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి విజయం సాధించడంలో కాపు సామాజిక వర్గం అండదండలే కీలకంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి కూడా కాపు సామాజిక వర్గం తమతోపాటే ఉండేలా చూసుకునేందుకు కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలపై దృష్టి సారించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని కాపు నేతలపై మరింత దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కాపు నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అగ్ర నాయకులను పార్టీలో చేర్చుకునే బాధితులను ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు నేతలకు ఆయన అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక బడా నేతను వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలను కోరుకుంటున్నారు. అదే జరిగితే వైసిపికి పెద్ద దెబ్బగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో. ఏది ఏమైనా వైసీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఒడిదొడుకులను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.
WINTER SOLSTICE : నేడు 8 గంటలలో వెలుతురు.. ఖగోళంలో కొత్త వింత..
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..