యాంకరింగ్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎంతో విషయ పరిజ్ఞానం ఉండాలి. అదే సమయంలో ఎవరినీ నొప్పించకుండా, సందర్భానికి తగ్గట్టుగా మాటలను అల్లుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ మధ్య అలాంటి యాంకర్లు అరుదై పోయారు. విషయ పరిజ్ఞానం ఉండట్లేదు. ఏకంగా ముఖ్యమంత్రి పేర్లు మర్చిపోతున్నారు. ఇంకా కొందరైతే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వివాదమవుతుందనే కనీస అవగాహన లేకుండా.. నోటికొచ్చింది మాట్లాడేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా యాంకర్ శ్రీముఖి కూడా ఆ లిస్టులో చేరింది. (శ్రీముఖి)
ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి శ్రీముఖి గా వ్యవహరించింది. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లను పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రయత్నించి.. పురాణగాథ రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ హిందువులకు ఆగ్రహం తెప్పించింది. “రామ్ లక్ష్మణ్ అనేది ఫిజికల్ క్యారెక్టర్స్. కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు.. ఒకరు దిల్ రాజు అయితే, ఇంకొకరు శిరీష్ గారు” అంటూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం భగ్గుమంటోంది. శ్రీముఖి వెంటనే తన కామెంట్స్ ని వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదం మరింత ముదరకముందే శ్రీముఖి క్షమాపణలు చెబుతుందేమో చూడాలి.