32
నేడు (అక్టోబర్ 9) దర్శకుడు వి. వి. వినాయక్ (వివి వినాయక్) పుట్టినరోజు. 'ఆది', 'చెన్నకేశవరెడ్డి', 'ఠాగూర్' సినిమాలతో తెలుగునాట మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వినాయక్.. అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టి అదిరిపోయే కమర్షియల్ సినిమా తీయాలని ఎదురుచూస్తే వాళ్ళు ఎందరో ఉన్నారు. కాగా నేడు వినాయక్ 50వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి (చిరంజీవి), ప్రభాస్ (ప్రభాస్), రామ్ చరణ్ (రామ్ చరణ్) ఆయనను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చిరంజీవితో 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150', ప్రభాస్ తో 'యోగి', రామ్ చరణ్ తో 'నాయక్' సినిమాలు చేశారు వినాయక్.