Home సినిమా విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ – Prajapalana News

విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ


సినిమా పేరు: విడుదల 2
తారాగణం:విజయ్ సేతుపతి,సూరి,మంజువారియర్, గౌతమ్ వాసుదేవమీనన్,అనురాగ్ కశ్యప్, కిషోర్,ఇళవరసు,రాజీవ్ మీనన్
సంగీతం:ఇళయరాజా
సినిమాటోగ్రఫీ:ఆర్.వేళ్ రాజ్
రచన,దర్శకత్వం: వెట్రిమారన్
నిర్మాతలు:కుమార్,రామారావు
బ్యానర్స్:ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్,శ్రీ వేదాక్షర మూవీస్
విడుదల తేదీ: డిసెంబర్ 20 ,2024

2023 లో సూరి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పార్ట్ 1 ఘన విజయాన్ని అందుకుంది.ఇప్పుడు దానిని కొనసాగించినప్పుడు విడుదల పార్ట్ 2 ఈ రోజు థియేటర్లలోకి అడుగుపెట్టింది.పైగా ​​మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి హీరో కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
అభ్యుదయ భావాలు కలిగిన పెరుమాళ్(విజయ్ సేతుపతి) పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ గా వర్క్ చేస్తాడు.ఆ తర్వాత కొంత కాలానికి ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు,తనలాగే అభ్యుదయ భావాలు కలిగిన కూతురు ఓనర్ మహాలక్ష్మి(మంజు వారియర్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. ఈ ప్రభుత్వ పెద్దల మేరకు పోలీసులు పెరుమాళ్ ని చంపాలని రహస్యంగా బంధించి పోరాడుతూ ఉంటారు చిత్ర హింసలకి గురి చేస్తున్నారు.కానీ బయటికి పెరుమాళ్ పోలీసుల నుంచి పారిపోతాడు.టీచర్ గా పని చేస్తున్న పెరుమాళ్ తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణం ఏంటి? ,మహాలక్ష్మి లు కలిసి చేసిన పోరాటం ఏంటి ? ఈ కథలో పోలీస్ వాన్ డ్రైవర్ కుమారేశన్(సూరి) పాత్ర ఏంటి?

ఎనాలసిస్

విడుదల పార్ట్ 1 లో పోలీస్ ట్రైనింగ్ కి వచ్చిన సూరి,పెరుమాళ్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో మొదటి భాగం ముగుస్తుంది. పార్ట్ 2 లో పోలీసుల కస్టడీలో ఉన్న పెరుమాళ్ ని పోలీసులు చిత్ర హింసలకి గురి చేయడంతో ప్రారంభమయ్యి,పెరుమాళ్ గతంలో జరిగిన విషయాలన్నింటిని పార్ట్ 2 లో దర్శకుడు వెట్రి మారన్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి కథలు తమిళనాడులో తక్కువ గా వచ్చి ఉండవచ్చు.కానీ తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ఎర్రజెండా ఎలా పుట్టుకొస్తుందో,ఒక విప్లవకారుడు ఎలా పుట్టుకొస్తాడో,
కొంత మంది జమిందారీ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు,పేద వాళ్ళని ఎంత దారుణంగాిస్తూ,ఎదురుతిరిగితే ఎలా హతమారుస్తున్నారో,దానికి పరిష్కారం ప్రజల్లోనే ఉందనేది అంతర్లీనంగా చెప్పడం జరిగింది.ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ అభ్యుదయ బావాలు కలగడానికి గల కారణాలు,ఎర్రజెండాకి సంబంధించిన పార్టీ పెద్దల పరిచయం,పెరుమాళ్ల ఉద్యమ నాయకుడు తోడ్పడిన మనుషులు, ఆ తర్వాత ఆల్రెడీ పెళ్ళయ్యి భర్తని ఒక జమిందారీ వంశానికి చెందిన మహాలక్షి పరిచయం,ప్రేమ,పెళ్లి ని చూపించారు.ఇంకో పక్క కస్టడీ లో ఉన్న పెరుమాల్ నిస్తూనే ఈ కథ కలిగి చేసారు పెరుమాళ్ వాయిస్ ఓవర్ లో ఫ్లాష్ బ్యాక్ గా చెప్తూ ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా. కాకపోతే మహాలక్షి,పెరుమాళ్ పాత్రల మధ్య కథ ని కొంచం లెన్త్ గా చూపించి,ఆ క్యారెక్టర్స్ మధ్య ఎంటర్ టైన్మెంట్ ని చుపించాల్సింది. ఎందుకంటే మహా లక్ష్మి జమిందారీ వంశానికి చెందిన అమ్మాయైనా కూడా ఫ్యాక్టరీలో కార్మికులురాలిగా,ఖాకి డ్రెస్ వేసుకునే పని చేస్తుంది.కాబట్టి ఆ కోణంలో ఎంటర్ టైన్ మెంట్ ని ఫిక్స్ చేసింది. అదే విధంగా పెరుమాళ్ ని బంధించిన పోలీసులు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా వాళ్లే మాట్లాడుకుంటు ఉంటారు.కథ ప్రకారం ముఖ్యమంత్రి క్యారక్టర్ ని కూడా చూపించి ఆయనకి కథ కి ఉన్న లింక్ కి కూడా ఇన్ వాల్వ్ చేస్తాను. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే కథ స్టార్టింగ్ నుంచే సినిమా మొత్తం ఎలా ఉంటుందో తెలిసింది కాబట్టి సెకండ్ ఆఫ్ కూడా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది.పెరుమాళ్ అహింస నుంచి హింసకి పూనుకోవడం, ఆ తర్వాత హింసని కూడా వదిలేయడం లాంటివి చూపించి చివరకి ఒక నిర్ణయం తీసుకోవడంపైనే దృష్టి
కేంద్రీకరించడాన్ని చూపించారు.కాకపోతే అడవిలో పేరు మాల్ పోలీసులతో ట్రావెల్ అవుతారు వాళ్ళతో చెప్పే మాటలు గాని సన్నివేశాలు గాని చాలా కొత్తగా ఉన్నాయి.

నటీనటులు,సాంకేతిక నిపుణల పనితీరు:
విజయ్ సేతుపతి(విజయ్ సేతుపతి) యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.పెరుమాళ్ క్యారక్టర్ కి సంబంధించిన పలు షెడ్స్ లో తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు.మూవీ చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి విజయ్ సేతుపతి కనపడకుండా కేవలం పెరుమాళ్లు మాత్రమే కనపడతాడు.అంతలా ఆయన తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు.మంజు వారియర్ కూడా మహాలక్ష్మి క్యారక్టర్ లో సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ లో తనని తప్ప మరొకరిని ఊహించలేం.సూరితో పాటు మిగతా క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరు కూడా మన కళ్ళ ముందు మెదులుతున్న నిజమైన పాత్రల్లా నటించారు.ఇక వెట్రి మారన్(vetri maaran)దర్శకత్వ ప్రతిభ మరోసారి అర్ధమయ్యింది.ఆర్టీసుల నుంచి పర్ఫెక్ట్ నటనకి రాబట్టడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. చేసిన ఆర్టిస్ట్ కూడా తన పెర్ ఫార్మెన్స్ తో థియేటర్స్ లో విజిల్స్ వేయించాడు. డైలాగ్స్ కూడా కథ కి చాలా హెల్ప్ అవ్వడంతో పాటుగా ప్రతి ఒక్కర్ని కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.ఇళయరాజా నేపధ్య సంగీతం కూడా మూవీకి ప్లస్ అయ్యింది.పావురం అనే సాంగ్ అయితే హైలట్. కెమెరా పనితనం కూడా సూపర్బ్ గా ఉంది.నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే..

విడుదలై 2 లాంటి సామాజిక నేపథ్యంతో కూడిన కథలు తెలుగులో చాలానే వచ్చాయి.పైగా ​​తెలిసిన సన్నివేశాలు కూడా మూవీకి మైనస్‌గా మారవచ్చు.మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది.

రేటింగ్ 2 .5 / 5

అరుణాచలం


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech