'పెళ్ళి చూపులు' వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తో సోలో హీరోగా విజయ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ), డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ సినిమాకీ మంచి పేరు తీసుకొచ్చింది. 'పెళ్ళి చూపులు' తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి ఘన విజయాలతో స్టార్‌గా ఎదిగిన విజయ్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా 'పెళ్ళి చూపులు' తర్వాత 'ఈ నగరానికి ఏమైంది'తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన తరుణ్. ఇలా సినీ పరిశ్రమలో ఈ ఇద్దరూ ఎవరికివారు తమ మార్క్ చూపిస్తున్నారు. అలాంటి ఈ సెకండ్ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు చేతులు కలపబోతున్నట్లు.
విజయ్ కోసం తరుణ్ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. తరుణ్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన విజయ్.. సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు వినికిడి. నిజానికి 'కీడ కోలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే విజయ్ మాట్లాడుతూ.. త్వరలో తరుణ్ తో సినిమా చేస్తానని చెప్పాడు. స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు తెలిపాడు. మరి అదే కథతో ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారా? లేక మరో కొత్త కథతో చేయబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా, రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత తరుణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 'పెళ్ళి చూపులు' సినిమా 2016లో వచ్చింది. అంటే ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత విజయ్-తరుణ్ రెండో సినిమా కోసం చేతులు కలుపుతున్నారన్నమాట.