- అయినా అక్కడ ఆయన్ను ఎవరూ దెఖరు
- అర్హత లేని వారికి అమృత్ టెండర్లు ఇచ్చారు
- మేం టెండర్లు పిలిస్తే ప్రభుత్వానికి రూ. 65 కోట్లు మిగిలాయి
- కవిత. సృజన్ రెడ్డి వ్యాపారులు
- ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : అమృత్ టెండర్ల అక్రమాలపై గవర్నర్ విచారణ నుంచి బయటపడేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయినా ఆయన్ను అక్కడ ఎవరూ దెఖరు అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ టెండర్లు అర్హత లేని వాళ్లకు కేటీఆర్ అన్న మంత్రి వాటిని రద్దు చేయాలని చెప్పిందే తాను అన్నారు. తాము టెండర్ పిలవడంతో ప్రభుత్వానికి రూ. 65 కోట్లు మిగిలాయి.
అమృత్ టెండర్ల లో కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణ ఉత్తదేనని ఆయన కొట్టి పారేశారు. కవిత, సృజన్‌రెడ్డి లు వ్యాపార భాగస్వాములని..పాలమూరు టన్నెల్ పనులను చేసింది వారేనని గుర్తు చేశారు. అందుకు కేటీఆరే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్రాస్ ఓటింగ్‌తో బీజేపీకి లాభం చేకూర్చిందన్న కోమటిరెడ్డి ఆ సూచన అడ్వాంటేజ్‌గా తీసుకుని కేటీఆర్ బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని కామెంట్ చేశారు. రీటెండర్ ద్వారా ప్రభుత్వానికి మేలు జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ నగరానికి తెచ్చింది ఒరిజినల్ ఫార్ములా-1 కాదని మంత్రి ఎద్దేవా చేశారు.
ఈ రేసింగ్ లో.. కంపెనీ కి పాండ్స్ లోకి మార్చి నిధులు మళ్లించారని అది నేరమన్నారు. ఆ అక్రమంలో ఎక్కడ జైలుకి వెళ్తానో అనే భయం కేటీఆర్ కు పట్టుకుందని మంత్రి చెప్పారు. అమృత్ స్కీమ్ లో ఆయన.. ఇచ్చిన కంపనీ ఎవరిది..? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి..ప్రతిమ.. గజా కంపెనీలు కేసీఆర్ సన్నిహితులవే కదా ? అని నిలదీశారు. తన అవినీతి బయటకు వచ్చిందని గ్రహించిన కేటీఆర్ తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో ఆ ఇష్యూను డైవర్ట్ అందుకున్నాడు. కలక్టర్ మీద దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తే అన్నారు. పదేళ్ల బీఎస్ పాలనలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిన కేటీఆర్‌ని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసిందని.. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ నాయకులతో రహస్యంగా ములాఖత్ కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు.