Home సినిమా వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ – Prajapalana News

వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ


నటీనటులు: మేఘా ఆకాశ్, నరేశ్ అగస్త్య, రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, తారక్ పొన్నప్ప నిర్వహించారు.
రచన: తేజ దేశ్ రాజ్
ఎడిటింగ్: సాయి బాబు తళారి
మ్యూజిక్: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: షోయబ్ సిద్దిఖి
నిర్మాతలు: రామ్ తాళ్ళూరి
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
ఓటీటీ: జీ 5

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ 'వికటకవి' (విక్కటకవి). ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌కు 'సర్వం శక్తిమ' ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించిన మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. మంచి అంచనాలతో నేడు(నవంబర్ 28) ఓటీలోకి అడుగుపెట్టిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
రామకృష్ణ (నరేష్ అగస్త్య) డిటెక్టివ్. అతనిది హైదరాబాద్. కొన్ని కేసులు, అతని కేసుల్లో చిక్కుముడులు విప్పడానికి పోలీసులు సైతం సహాయం తీసుకుంటారు. రామకృష్ణ తెలివితేటలు చూసి తమ ఊరిలో సమాధానం లభించని ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారం వెతికే సత్తా అతనికి ఉందని ఓ ప్రొఫెసర్ భావిస్తున్నారు. రామకృష్ణ తల్లికి అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. వర్షపు శబ్దం వింటే ఆమెలో అలజడి, భయం మొదలవుతాయి. తల్లికి ఆపరేషన్ చేయడానికి అవసరమైన డబ్బు వస్తుందన్న ఆశతో రామకృష్ణ అమరగిరి సంస్థానానికి వెళ్తాడు. అక్కడ దేవతల గుట్ట (కొండ) మీదకు రాత్రివేళల్లో వెళ్లిన జనాలు గతం మర్చిపోతారు. అది అమ్మోరు శాపమని అమరగిరి ప్రజలు భావిస్తున్నారు. అది నిజమా? కాదా? అని దానికి రామకృష్ణ ఓ రోజు కొండ మీదకు వెళ్తాడు. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి ముప్పై అయిదు నుండి నలభై నిమిషాల వరకు ఉంది. 1970 లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రదర్శించిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఈ సిరీస్ రెగ్యులర్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ లేదు. కథలో వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యానికి తగ్గట్టుగానే మొదటి సన్నివేశం నుంచే ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా కథను ముందుకు తీసుకెళ్ళారు. రెండు, మూడు ఎపిసోడ్లలో కొన్ని క్యారెక్టర్లు ఎందుకు ఉంచారా? అనే అనుమానం చూస్తే ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే ఎపిసోడ్ లో వాటికి లింక్ చేస్తూ వచ్చే ట్విస్ట్‌లు బాగానే ఉన్నాయి.

రొమాంటిక్ సీన్లు, అశ్లీల పదాలకి జోలికి పోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. డిటెక్ చేసే ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్ట్ లు, అవి పంచే థ్రిల్ ని ఆడియన్స్ కి ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. పాత్రలను మలిచిన తీరు బాగుంది. అలాగే నటినటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. కొన్ని సీన్స్ లో కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించినా, ఆ చిన్న చిన్న లాజిక్స్ ని వదిలేసి.. చివరి వరకు సిరీస్ ఎంగేజ్ చేస్తుంది. ప్రత్యేకించి ఈ సిరీస్ థ్రిల్లర్ లవర్స్ కి బాగా నచ్చేస్తుంది.

1970 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగా ఆర్ట్ వర్క్ బాగా చేశారు. షోయబ్ సిద్దిఖి సినిమాటోగ్రఫీ మెప్పించింది. అమరగిరి ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. సాయి బాబు ఎడిటింగ్ నీట్ గా ఉంది. బిజిఎం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
రామకృష్ణగా నరేశ్ అగస్త్య, లక్ష్మీగా మేఘా ఆకాశ్ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే రఘుపతిగా రఘు కుంచె బలమైన పాత్రలో మెప్పించారు. ఇక మిగిలినవారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా..
థ్రిల్ ని పంచే వికటకవి. మస్ట్ వాచెబుల్.

రేటింగ్: 3/5

✍️. దాసరి మల్లేశ్


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech