31
ముద్ర,సెంట్రల్ డెస్క్:-తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల విధుల్లో 13 మంది ఉద్యోగులు మరణించారు.. తాజాగా మరణించిన వారి కుటుంబాలకు ఈసీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రాష్ట్రంలోని 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఈసీ ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది. మొత్తం రూ.1.95 కోట్లను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.