- నాగారంలో మరో 42 ఎకరాలు బదలాయింపు
- గతంలో క్లోజ్ చేసిన ఫైల్
- రీ ఓపెన్‌కు నిర్ణయం
- అమోయ్ చుట్టూ కేసులు
- నేడో, రేపో ఇంకో ఎఫ్‌ఐఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది ఐఎస్‌లు అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ప్రభుత్వం అడ్డ ఏర్పాటు అయ్యాక ధరణిలో అదుపు లేకుండా కోట్ల విలువ చేసే భూముల మాటున దోచేశారు. ఈ కమీషన్ల రూపంలో భారీగా డబ్బులు పొగుడుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కి నోటీసులు ఇచ్చింది. అటు అప్పటి సీఎస్, సీసీఎల్ ఏ కమిషనర్‌కు సైతం భూ దందాలో పాత్ర ఉందని అనుమానిస్తున్నారు.
భూదాన్ భూముల్లో ఐఎస్ అధికారి అమోయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి సహాకారంతో విచ్చలవిడిగా భూ దందాపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈడీ ఆయనపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకైతే ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టూ భూ కబ్జా కేసులు తిరుగుతున్నాయి. తాజాగా ఆయనపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు. ఈడీ, జైంట్ ఇన్వెస్టిగేషర్‌తో భూ అక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వర రం అయిన నగరం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఈడీ అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుతో పాటు ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నారు.
ఏంటా కేసు
సివిల్ నేచర్ పేరుతో క్లోజ్ చేసిన నగరం కేసు సహా ఇలాంటి కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. సీపీ సుధీర్ బాబు కూడా గతంలోనే లీకు ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీంతో 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములకు సంబంధించిన కేసులను స్థానిక పోలీసులు మళ్లీ బయటకు తీస్తున్నారు. విచారణ జరపడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.
ఈ కేసును సివిల్ నేచర్ పేరుతో గలేడాది మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేశారు. ఈ మేరకు కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ అందించారు. దీంతో మాజీ తహసీల్దార్ జ్యోతి సహా మరికొంత మంది నిందితులపై నమోదైన ఎఫ్ఎఆర్ ఆగస్టులో క్లోజ్ అయింది. అయితే దీంట్లో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ పేరు ప్రస్తావనకు రాలేదు. అయితే, ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 181 నెంబర్ పరిధిలో సుమారు 43 ఎకరాల భూదాన్ భూములను అమోయ్ కుమార్ గుర్తించారు. కేసు నేపథ్యంలో మళ్లీ రీఓపెన్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఈడీ అధికారులు డీజీపీని కలిశారు. ఇలాంటివేగ్రేటర్ మూసివేసిన కేసులను కూడా పరిశీలించాలని. ఈడీకి అందిన 12 ఫిర్యాదులను కూడా స్థానిక పోలీసులు మళ్లీ సమీక్షిస్తున్నారు. నగరం చేసుకు సంబంధించి గతంలో మహేశవరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఎఆర్‌ను పునఃపరిశీలించడంతో పాటు అమోయ్ కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు.
శంకర్ హిల్స్ కేసులో అరెస్టులు ఉంటాయా?
వట్టినాగులపల్లిలో మొత్తం 33 సర్వే నెంబర్లలో 460 ఎకరాల్లో శంకర్ హిల్స్ ఉంటుంది. 3,328 ప్లాట్లు 1983 నుండి 1986 వరకు అమ్మకాలు జరిగాయి. కానీ, 2013లో కొంతమంది తమకు విక్రయించారని ప్లాట్స్ మీదకు వచ్చారు. ఇలా టైటిల్ వివాదంలో ఉన్న భూములకు అప్పటి రంగారెడ్డి కలెక్టర్ ఫినిక్స్, దాని అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థకు మేలు చేసేలా ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీసివేసి రాత్రికి రాత్రి ధరణిలో పేర్లు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ ఓనర్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జరిగిన అన్యాయానికి బాధ్యులు ఆనాటి కలెక్టర్ అని ప్రభుత్వ పెద్దలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అరెస్టులపై చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అమోయ్ కుమార్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో అమోయ్ కుమార్ బాధితులు వరుసగా బయటకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు కలిసి తమ భూములను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దగ్గరికెళితే కోర్టుకు చేతులు దులుపుకున్నట్లు చెబుతున్నారని, అందుకే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అంతా భూ దందాలే
భూదాన్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. ధరణిని అడ్డుపెట్టుకుని దందా సాగింది. దీని వెనుక కీలక పాత్రధారిగా అమోయ్ కుమార్ ఉండగా, సూత్రధారులు ఎవరనేది ఈడీ నిగ్గుతేల్చే పనిలో ఉంది. అంతేకాదు, అమోయ్ కుమార్‌కు సంబంధించిన ఫైళ్ల తారుమారు వ్యవహారాలకు సంబంధించి కూపీ లాగుతోంది. ఇలాంటి సమయంలో ఈడీకి వరుస ఫిర్యాదులు అందడం హాట్ టాపిక్‌గా మారింది. కొండాపూర్ 88 ఎకరాలకు సంబంధించి తాజాగా అమోయ్ కుమార్‌తో సహాలోని ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ ఎస్‌ఐ సోమేష్ కుమార్‌పై ఈడీకి కంప్లైంట్ చేశారు. మజీద్ బండిలో సర్వే నెంబర్ 104 నుంచి 108 వరకు ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్‌కు ఓ కుటుంబం దానం చేసింది. దాంట్లో 42 ఎకరాల భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు బదలాయిస్తూ గత ప్రభుత్వంలో జీవో 45ని జారీ చేసింది. తాజాగా బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. తమకు చెందిన భూమికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అప్పటికప్పుడు జీవో ఇచ్చేసి ముగ్గురు మోసం చేశారు. వారి దగ్గరున్న ఆధారాలను కూడా ఈడీకి సమర్పించారు.
గుట్టల బేగంపేట భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
గుట్టల బేగంపేట భూములపై అమోయ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది. నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ 63లోని 52 ఎకరాల విలువైన భూములను 2022లో డీనోటిఫై చేస్తూ నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు తీర్పు వచ్చింది. నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వులను అప్పుడు న్యాయస్థానం తప్పుబట్టింది.