ఏపీలో ప్రజలకు అందించే పౌర సేవలను మరింత సులభంగా పేదలకు చేర్చడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం పౌర సేవలను వాట్సాప్ ద్వారా సిద్ధమవుతోంది. ఈ తరహాలో సేవలు అందించనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. అందుకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల్లోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఒక నెంబర్ ను కొద్దినే ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రభుత్వం తీసుకురానున్న అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది. ఈ నెంబరు వన్ స్టాప్ సెంటర్ మాదిరిగా పనిచేయనుంది. తొలి దశలో ఇందులో 153 రకాల సేవలు అందిస్తున్న ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళనున్నారు. సదస్సులో భాగంగా ఈ మేరకు కలెక్టర్ ఆర్టిజిఎస్ సీఈవో దినేష్ కుమార్ ఈ సేవలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇచ్చారు.
వాట్సాప్ ద్వారా కొన్ని రకాల సేవలను అందించమన్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు చేరడం అంటే భారీ వర్షాలు, వరదల ముప్పు, విద్యాసంస్థలకు సెలవులు, విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం, వైరస్‌లు వ్యాప్తి చెందడం, పిడుగులు పడే అవకాశం, అభివృద్ధి పనులకు సంబంధించిన పనులకు సంబంధించి ప్రభుత్వ సమాచార సేకరణకు చేరవేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు తమ వినతులు, వెంటనే ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్‌కు మెసేజ్ చేస్తే వారికి ఒక లింకు వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా పొందుపరచాల్సి ఉంటుంది. సమస్యను అందులో తెలిపే వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరు వద్దంటే వాటిని తెలుసుకునే అవకాశం ఉంది.
వీటితోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు, అర్హతల పథకాల లబ్ధి గురించి ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల వాట్సాప్‌లో పంపించనున్నారు. నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడే టికెట్లు, వసతి సహా అన్ని బుక్ చేసుకోవడానికి సదుపాయం కల్పించనున్నారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించే ప్రభుత్వం కల్పించనుంది. ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్ విరాళాలు పంపడం ఏర్పాటు చేసే సౌకర్యం కల్పించనుంది. వాట్సప్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ విధానం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ వాట్సాప్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
Daily Horoscope | ఈ రోజు రాశిఫలాలు 14 డిసెంబర్ 2024
కరెన్సీ నోట్లు ముద్రించాలంటే ఒక్కో నోటుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..