- ఉదారంగా సాయం చేయండి
- వరదలతో అతలాకుతలం అయ్యాం
- మొత్తం 8 రంగాలు అధ్వాన్నమయ్యాయి
- 35 మంది చనిపోయారు
- ప్రాథమిక అంచనా రూ. 5 వేల కోట్లు
- పూర్తిస్థాయి నివేదిక తర్వాత 9 వేల కోట్లకు చేరింది
- 17,916 మంది నిరాశ్రయులయ్యారు
- కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
ముద్ర, తెలంగాణ బ్యూరో :-తెలంగాణకు వరదల వల్ల రూ.9 వేల కోట్లపైనే నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో రాష్ట్రానికి ఉదారంగా సాయం చేయాలని విన్నవించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయిందని కేంద్ర బృందానికి వివరించారు. వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా ఎనిమిది రంగాలు పూర్తిగా అధ్వానం అయ్యాయని ఉన్నాయి. వరదల్లో చిక్కుకుని 35 మంది చనిపోగా, రైతులకు తీరని నష్టం వాటిల్లిందని వివరించారు. వేల ఎకరాల పంట నీటి మునడంతో పాటుగా పెద్ద సంఖ్యలో రోడ్డు, కల్వర్టులు, బ్రిడ్జిలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ఇళ్లు కు సైతం పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. అలాగే వరదలకు సుమారు 17వేల మందికిపైగా నిరాశ్రయులయ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో వరద సాయంపై ఉదారంగా కేంద్రానికి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కాగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం బుధవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. రెండు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో వరదల వల్ల నష్టపోయిన పలు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. బాధితులతో నేరుగా ముచ్చటించింది. వరద సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం…వ్యవహరించిన తీరును కూడా అడిగి తెలుసుకున్నారు. కాగా గురువారం నాటితో వారి పర్యటన ముగియడంతో వర్షాల కారణంగా వాటిల్లిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక అందించింది. బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయడం అందులో విన్నవించింది.
నివేదికలో పొందుపరిచిన ప్రధాన అంశాలు:
భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల దాటికి సూర్యపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి కారణమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పట్టణాల్లో కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మొదటిగా ప్రాథమిక నష్టం రూ.5,438 కోట్ల అంచనా వేయగా, అది దాదాపు రెట్టింపైంది.ఇప్పటి వరకు భారీ వర్షాలు, వరదలకు 35 మంది చనిపోయారు. 28,869 ఇళ్లు కూలగా, 17,916 మంది నిరాశ్రయులు అయ్యారు. మొత్తం 75,097 పశువులు భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు కొట్టుకుపోయి చనిపోయాయని వివరించింది.