Home తాజా వార్తలు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 11 నెలల్లో ఏం కొల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు
  • అరెస్ట్‌లకు మేం భయపడం
  • మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం
  • అధికారంలోకి రాగానే వాణ్ణి, వీన్ని లోపలేయాలని చూడం

ముద్ర, తెలంగాణ బ్యూరో :- అరెస్టులకు భయపడం…మళ్లీ వచ్చేది రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి…ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు ఏమి కోల్పోయారని తెలుసుకున్నారు. శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం లో పాలకుర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సమావేశంలో సినీమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లి ప్రజలను కదిలించినా సరే… మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ముక్త కంఠంతో తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.అందులో ఎలాంటి అనుమానం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి11 నెలలు గడిచిపోయింది. కానీ ప్రజలకు అందిస్తున్న హామీలను నిలబెట్టుకోలేని అసమర్ధ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం కష్టపడి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి..విన్నీ లోపల వేయాలని చూడమన్నారు..ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. నిర్మాణము చేయాలి..పదిమందికి లాభం కావాలి.ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..గత ఎన్నికల్లో మనం మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే..కానీ 90 శాతము ఎవరు ఆడగకుండా పనులు చేసి చూపించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech